Take a fresh look at your lifestyle.

30 జూన్ వరకు పాన్-ఆధార్ లింక్‌ గడువు

0 204

30 జూన్ వరకు పాన్-ఆధార్ లింక్‌ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ, మార్చి 28 : శాశ్వత ఖాతా నంబర్‌ను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించే గడువు మరికొంత కాలం పొడిగించారు. జూలై 1 లోపు తప్పని సరి పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలంటున్నారు చార్టెడ్ అక్కౌంటెంట్ టీ.ప్రవీణ్ కుమార్. .పాన్‌-ఆధార్‌ నంబర్‌ అనుసంధాన గడువును పెంచుతూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు ఆయన.

ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇప్పటికే నాలుగు సార్లు ఈ గడువును పొడిగించింది. చివరిసారిగా.. 2022 మార్చి 30న, పాన్‌-ఆధార్‌ నంబర్‌ అనుసంధాన డెడ్‌లైన్‌ను ఒక సంవత్సరం పాటు పొడిగించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌, 2022 ఏప్రిల్ 1 నుంచి మూడు నెలల వరకు రూ. 500 ఆలస్య రుసుమును వసూలు చేసింది. ఆ తర్వాత రూ. 1000 లేట్‌ ఫీజ్‌ నిర్ణయించింది.2023 మార్చి 31వ తేదీ లోగా తమ పాన్‌ను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించడంలో విఫలమైన వ్యక్తుల పాన్ నిష్క్రియంగా మారుతుంది. తద్వారా, పాన్‌ సమాచారాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఆదాయ పన్ను విభాగానికి అందించనట్లు పరిగణిస్తారు. పాన్‌ సమాచారం తెలియజేయడంలో విఫలమైనందుకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వర్తించే అన్ని పరిణామాలు లేదా చర్యలు అటువంటి పన్ను చెల్లింపుదార్లకు వర్తిస్తాయని ఆదాయ పన్ను విభాగం అధికారులు పేర్కొన్నారు.

కేవైసీ వల్ల నకిలీ పాన్ కార్డుల

వినియోగం నిషేదించవచ్చు.

ప్రతి ఒక్కరి కేవైసీలో పాన్, ఆధార్ ముఖ్యమైన భాగం. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనివల్ల నకిలీ పాన్ కార్డుల వినియోగాన్ని నిరోధించవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న కేసులు కూడా చాలా బయటపడ్డాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. పాన్‌ను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించడంలో విఫలమై పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే, అప్పుడు సదరు పన్ను చెల్లింపుదారు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేడు.

అలాగే, కొత్త పాన్ పొందేందుకు ఆధార్‌ను ఇవ్వడం తప్పనిసరి. ఆధార్‌ – పాన్‌ లింక్‌ చేయకపోతే ఈ విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో పాటు… కొత్తగా ఒక బ్యాంక్‌ అకౌంట్‌ లేదా డీమ్యాట్‌ అకౌంట్‌ వంటివి కూడా ఓపెన్ చేయలేడు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ వంటి స్టాక్ మార్కెట్‌ పెట్టుబడులు పెట్టలేడు. కాబట్టి, మీరు ఇప్పటికీ మీ పాన్‌ – ఆధార్‌ అనుసంధానాన్ని పూర్తి చేయకపోతే తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేయండి.

Leave A Reply

Your email address will not be published.

Breaking