Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ ఆవిష్కరణ సభలో వినిపించని ‘‘జై తెలంగాణ’’

0 573

      కేసీఆర్ స్పీచ్..

ఈ స్పీచ్ కోసం తెలంగాణ ప్రజలు గంటల తరబడి నిరిక్షించేవారు.

కేసీఆర్ స్పీచ్ విని యువత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో ముందు వరుసలో ఉండేవారు.

నీళ్లు.. నిధులు.. ఉద్యోగాలు

ఈ మూడు ఆంశాలతో తెలంగాణ అస్తిత్వం ముడి పడి ఉందని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో తెలంగాణ యాసలో కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుతుంటే ఆ స్పీచ్ లోని ముక్యంశాలు ఆలోచింప చేస్తుండే..

కానీ..

ఖమ్మం బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఆవిర్భావ సభ కూల్.. కూల్ గా కొనసాగింది.

రొటిన్ స్పీచ్ తో బోర్ బోర్ గా ఉంది.

ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసి కేసీఆర్ స్పీచ్ ఉంది. ఈ స్పీచ్ ఇప్పటికే ప్రజలు చాలా సార్లు విన్నారు.

ప్రధాని మోదీతో విభేదించిన నుంచి కేసీఆర్ నోటి నుంచి ఇవే విమర్శలు.  బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఆవిర్భావ సభలో హట్.. హట్ టాపిక్ ఉంటుందని నిరిక్షించిన వారికి నిరాశ మిగిలింది.

రైతు బందు పథకం.. త్రాగు నీళ్లు.. విద్యుత్ సరఫరా.. దళిత బందు..

ఇగో.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేసీఆర్ ఏకరువు పెట్టారు.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని తెలుగు స్పీచ్ లో పేర్కొన్నారు సీఎం కేసీఆర్.

ఒకవేళ ఈ స్పీచ్ ను హిందీలో మాట్లాడి ఉంటే ఆ సభకు ముక్యఅతిథిగా హాజరైన వారు సైత బాధ పడేవారెమో..?

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఇతర విపక్షాలను గెలిపిస్తే దేశ వ్యాప్తంగా తెలంగాణ స్పూర్తితో అన్ని సంక్షేమ పథకలను అమలు చేస్తామన్నారు ఆయన. మొదటి సారి జర్నలిస్ట్ లను స్పీచ్ మధ్యలో చాలా సార్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిలా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి  సహాకరించాలని కోరారు కేసీఆర్.

 

అందరి టార్గెట్  ప్రధాని మోదీయే..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్, సీపీఐ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా, ఉత్తర ప్రదేశ్‌ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ల స్పీచ్ లు కూడా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. బీజేపీ మత తత్వ పార్టీ వల్ల దేశానికి ప్రమాదంగా పేర్కొన్నారు వారు  గవర్నర్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ప్రధాని మోదీ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఎప్పటిలా తెలంగాణ ప్రజల ముందు హిందీలో అదే స్పీచ్ ను ఇచ్చారు.

బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ..

బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ ఎద్దేవా చేశారు. బికారి రాజు అవుతాడు. విపక్షాల ఎమ్మెల్యేలను కొనాలి. అధికారంలోకి రావాలి. ఇదే బీజేపీ తీరు. దానికి ముగింపు పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారాయన.

కేసీఆర్ నోట వినబడని ‘‘జై తెలంగాణ’’ మాట..

ఔను.. మీరు చదివింది అక్షరాల నిజం.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కామన్ గా వినిపించిన ‘‘జై తెలంగాణ’’ మాట ముఖ్యమంత్రి కేసీఆర్ నోట రాలేదు. నిజానికి కేసీఆర్ ఏది చేసిన ముందు చూపుతో వ్యూహత్మకంగా చేస్తాడనేది అందరి నమ్మకం. ‘‘జై తెలంగాణ’’ కు బదులుగా ‘‘జై భారత్’’ అంటూ పిడికిలి బిగించి నినాదం చేసిన కేసీఆర్ కు ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.

బీజేపీ – కాంగ్రెస్ దొందు దొందే..

కానీ.. మన రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని టార్గెట్ చేసి స్పీచ్ ఇచ్చినట్లుగా ఉంది. జనంను సమీకరించడంలో బీఆర్ఎస్ క్యాడర్ సక్సెస్..బీజేపీ – కాంగ్రెస్ దొందు దొందే అంటూ విమర్శించారు కేసీఆర్. ఈ రెండు పార్టీలు గాకుండా ప్రతి పక్షలకు కేంద్రంలో అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆయన. అయితే.. కేసీఆర్ స్పీచ్ లో కాంగ్రెస్ ను టార్గెట్ చేయక పోవడం విశేషం.

హిందీలో స్పీచ్.. అర్థం కాని జనం..

కానీ.. ఆ ఆవిష్కరణ సభకు హజరైన పెద్దలు హిందీలో మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నోరు వెళ్ల బెట్టి చూస్తున్నారు.

బీఆర్ఎస్ ఆవిష్కరణ సభ అనేకంటే ఖమ్మంలో సంక్షేమ పథకల సభ అంటే ఇంకా బాగుండెదెమో.. కేసీఆర్ స్పీచ్ ప్రారంభించే ముందు జనంతో అదే మాట్లాడారు. గ్రామ పంచాయితీలకు.. మేజర్ గ్రామ పంచాయితీలకు.. మున్సిపల్ లకు ఇలా అభివృద్ది నిధులను సభా వేధికపై ప్రకటించారు.

జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు..

బీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావం తరువాత తమ తల రాతలు మారుతాయనే ఆశతో ఉన్న ఖమ్మం జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రభుత్వ స్థలం లేక పోతే డబ్బులు పెట్టి ల్యాండ్ కొని వెంటనే ఖమ్మంలో ఉన్న జర్నలిస్ట్ లు.. ఫోటో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హరీష్ రావును పిలుచుకుని సభ వేదికపై కేసీఆర్ చెప్పారు.

ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఎన్నో సార్లు..

అగో.. ఇలా జర్నలిస్టులకు ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం చేస్తామని కేసీఆర్  ఎన్నో సార్లు చెప్పారనేది మీ అనుమానమా..? నిజమే.. కేసీఆర్ మాట ఇస్తే తలకాయ కోసుకుంటాడు గాని.. మాట తప్పడు అనేది నిజం.. ఇప్పటికే కొన్ని జిల్లాలలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల ఫైల్ మూవ్ అవుతుంది. స్టేట్ లోని ప్రతి జర్నలిస్ట్ కు కూడా ఇళ్ల స్థలం ఇస్తాడెమో ఎదురు చూడాల్సిందే.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking