Take a fresh look at your lifestyle.

ఆస్ట్రేలియాలోని భారతీయుల భద్రతకు భరోసా

0 54

భారతీయుల భద్రతకు భరోసా

న్యూఢిల్లీ, మార్చి 10,గా ఆస్ట్రేలియాలోని భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలని ప్రధాని మోదీ అడిగారు. ఇందుకు ఆ దేశ ప్రధాని హామీ ఇచ్చారు.

కొద్ది నెలలుగా ఆస్ట్రేలియాలోని పలు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. గోడలపై అసభ్యకరమైన రాతలు రాస్తున్నారు. దీనిపై చాలా రోజులుగా భారతీయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. “ఆస్ట్రేలియాలో కొన్ని ఆలయాలపై దాడులు జరిగిన ఘటనలు నా దృష్టికి వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రధాని ఆంథోని అల్పనీస్‌తో చర్చించాను. భారతీయుల భద్రతకు భరోసా ఇస్తామని నాకు హామీ ఇచ్చారు. ఇదే మా ప్రాధాన్యత అని కూడా చెప్పారు”- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే సమావేశంలో ద్వైపాక్షిక బంధంపై చర్చలు జరిపారు ఇద్దరు ప్రధానులు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మెరిటైమ్ సెక్యూరిటీ విషయంలోనూ రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు. “రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది చాలా కీలకం. భద్రతా పరంగానూ పరస్పరం సహకరించుకోవాలి. అందుకే ఇండో పసిఫిక్ రీజియన్‌లో రక్షణకు సంబంధించిన అంశాన్ని చర్చించాం. ఆర్థికపరమైన ఒప్పందాలు జరిగేందుకూ ఇరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి
– ప్రధాని నరేంద్ర మోదీ
ఆస్ట్రేలియాలోని ఓ ఆలయానికి ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవాలంటే “ఖలిస్థాన్ జిందాబాద్” అని నినాదాలు చేయాలని హెచ్చరించారు ఆగంతకులు. వేడుకలు ప్రశాంతంగా జరగాలంటే ఈ స్లోగన్స్ ఇవ్వాల్సిందేనని బెదిరించారు. బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిరానికి ఈ కాల్స్ వచ్చాయి. గతంలోనూ ఆస్ట్రేలియాలో పలు హిందూ ఆలయాలపై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.

కొందరు ఇలాగే కాల్స్ చేసి బెదిరించారు. ముఖ్యంగా విక్టోరియా ప్రావిన్స్‌లోని హిందూ ఆలయాలపై దాడి చేశారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఆలయ గోడలపై అసభ్యకరంగా రాయడం అలజడి సృష్టించింది. ఆస్ట్రేలియా టుడే చెప్పిన వివరాక ప్రకారం..గాయత్రి మందిర్ అధ్యక్షుడు జై రామ్, ఉపాధ్యక్షుడు ధర్మేశ్ ప్రసాద్‌కు కాల్స్ చేసి బెదిరించాడో వ్యక్తి,. అంతే కాదు తన పేరు గురువదేశ్ సింగ్‌ అని కూడా చెప్పాడు. హిందువులంతా ఖలిస్థాన్‌కు మద్దతుగా ఉండాల్సిందేనని చెప్పాడు

ఆలయానికి వచ్చిన వాళ్లందరూ ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయాలని అని డిమాండ్ చేశాడు. అటు మెల్‌బోర్న్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఓ ఆలయ పూజారికి కాల్‌ చేసిన ఖలిస్థాన్ మద్దతు దారులు బెదిరించారు. ఆలయం మూసేయాలని, పూజలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking