Take a fresh look at your lifestyle.

సమ్మర్ లో కార్పొరేట్ విద్యా సంస్థల క్లాసులు

0 26

సమ్మర్ లో ఇంటర్ క్లాసులు ప్రారంభించిన విద్యా సంస్థలు

చోద్యం చూస్తున్న ఇంటర్ విద్యా మండలి

హైదరాబాద్, ఏప్రిల్ 19 : 2023 – 24 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం తరగతులను బాటంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల వ్యవహార శైలి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పిమధుసూదన్ రెడ్డి.

పదో తరగతి ఫలితాలు వెల్లడించకుండానే ఇంటర్ విద్యా మండల విద్యార్థులు ప్రవేశాలకు కానీ కళాశాలల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించకుండానే ప్రైవేట్ యాజమాన్యాలు రాష్ట్రంలో స్వేచ్ఛగా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు ఆయన.  నియంత్రించవలసిన విద్యా మండలి సెక్రటరీ చోద్యం చూస్తున్నారని ఇంటర్ విద్యార్థి చైర్మన్ డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు

గతంలో వేసవి తరగతులు నిర్వహణపై ఆంక్షలు విధించడంతోపాటు అధికారుల బృందాలతో దాడులు నిర్వహించే వారిని, కానీ ఇప్పుడు ఇంటర్ విద్యా మండలి అధికారులు ఆ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదని యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా నడుస్తున్నదన్నారు  మధుసూదన్ రెడ్డి.

ఆరు నెలలు గడుస్తున్నా ఇంటర్ విద్యా మండలికి రెగ్యులర్ సెక్రెటరి ని నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంగా పేర్కొన్నారు ఏదైనా సంక్షోభం నెలకొంటే తప్ప విద్యాశాఖ గురించి పట్టించుకోవడం ఈ ప్రభుత్వం మానేసిందని కార్పొరేట్ విద్యా సంస్థల పనితీరుపై ఉన్న స్థాయి కమిటీ వేస్తామని నిబంధనలను పాటించని కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని MHRD వేదికగా హెచ్చరించిన ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు మధుసూదన్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Breaking