Take a fresh look at your lifestyle.

ఈ ఐస్ క్రీం తింటే అనారోగ్యం పాలే

0 43

వామ్మో ఐస్ క్రీమ్..

ఈ ఐస్ క్రీం తింటే అనారోగ్యం పాలే

ఆరోగ్యం పై తల్లిదండ్రులు పిల్లలు గగ్గోలు

అల్లూరి సీతారామరాజు జిల్లా , ఏప్రిల్ 10 : ఐస్ క్రీమ్ అంటే తినని వారు ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ చల్లటి పదార్థాన్ని తినేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు అలాగే విందు వినోదాల్లో శుభకార్యాల్లో అందరూ తింటుంటారు. అంతలా ఇష్టపడే ఈ ఐస్ క్రీములు తినాలంటే ఇప్పుడూ ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు, పిల్లలు అంటున్నారు వివరాలు ఇలా ఉన్నాయి అరకులోయ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఆర్ అండ్ బి కు వెళ్లే రోడ్డు పక్కన స్టార్ అన్నపూర్ణ నిర్వాహకుడు కాలం చెల్లిన పూర్తిగా పాడైన ఐస్ క్రీం,కోన్ లు విక్రయాలు కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు వాటిని తిన్నవారి పరిస్థితి ఏంటన్న దానిపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది ఎప్పటికప్పుడు వీటిపై కన్నెయ్యాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వల్లే కాలం చెల్లిన  ఐస్ క్రీములు,కోన్లు విక్రయాలు జోరందుకున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి దానికీ తోడు అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు కాలం చెల్లిన ఐస్ క్రీములు తినడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని భయాందోళనకు గురౌతున్నారు దీంతో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైన సంబంధింత అధికారులు స్పందించి కాలం చెల్లిన, ఐస్ క్రీమ్ లపై నిఘా ఉంచాలని వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకపోతే బారి మూల్యం చెల్లించాల్సి వస్తోందని స్థానిక ప్రజలు తల్లిదండ్రులు,పిల్లలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking