Take a fresh look at your lifestyle.

సిక్కింలోని యుక్సోమ్‌కు వాయువ్యంగా భూకంపం

0 353

సిక్కింలోని యుక్సోమ్‌కు వాయువ్యంగా భూకంపం

సిక్కిం : సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సోమ్‌కు వాయువ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు భూకంపం సంభవించింది.యుక్సోమ్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

ఈ భూ ప్రకంపనలతో ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆదివారం అసోంలోనూ భూమి కంపించింది.ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల వేలాదిమంది మరణించిన నేపథ్యంలో భారతదేశంలోని సిక్కిం, అసోంలలో భూప్రకంపనలు సంభవించినపుడు జనం తీవ్ర భయాందోళనలు చెందారు.

అసోంలో సంభవించిన భూకంపం ఘటన జరిగిన మరునాడే సిక్కింను భూప్రకంపనలు వణికించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర కలవరపడ్డారు. భూమి కంపించినపుడల్లా ప్రజలు టర్కీ, సిరియా భూకంప విపత్తును గుర్తు చేసుకొని వణుకుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking