Take a fresh look at your lifestyle.

నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్ గా డాక్టర్ విశాల్ 

0 90

ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 

నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్ గా డాక్టర్ విశాల్ ఆకుల 

ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎన్నికలలో డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు  డాక్టర్ విశాల్ ఆకుల ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలలో గెలుపొందటం పట్ల తెలంగాణ వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 1947 సంవత్సరంలో స్థాపించబడినది ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా మానసిక వైద్య అవగాహనపై మరియు మత్తుపదార్థాల నివారణకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ఈ రోజు జరిగిన జాతీయ ఎన్నికలలో 29 రాష్ట్రాల మానసిక వైద్యులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది.

ఈ ఎన్నికల ఫలితాలు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ మహాసభలలో జాతీయ ఎన్నికల అధికారి డాక్టర్ అశోక్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాలను వెలువరించారు.

జాతీయ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ విశాల్ ఆకుల గారు 2023 నుండీ 2026 సంవత్సరము వరకు డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్ గా 1430 ఓట్ల తో విజయం సాధించారు.  ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ నా గెలుపునకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర మానసిక వైద్యుల సంఘము అధ్యక్షులు డాక్టర్ జార్జి రెడ్డి గారికి, డాక్టర్ కిషన్ గారికి డాక్టర్ రఘురాం రెడ్డి గారికి మరియు సభ్యులందరికీ కూడా ధన్యవాదములు తెలిపారు.

జాతీయ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదవిని చేపట్టిన న మొదటి వ్యక్తిగా డాక్టర్ విశాల్ ఆకుల గారు చోటు సంపాదించడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.

Breaking