Take a fresh look at your lifestyle.

గవర్నర్ ను కలిసిన డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

0 329

గవర్నర్ ను కలిసిన డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్. మార్చి 18 : పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్ ను, బాడీని తొలగించాలని బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు గవర్నర్ తమిళిసైని కలిసి వినతి పత్రం అంద చేశారు. పేపర్ లీకేజీ కేసు సిబిఐకి అప్పగించాలని ఫిర్యాదు చేశారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పేపర్ లీకేజ్ పై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఆయన.

కెసిఆర్, కేటిఆర్, మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని నిలదీసారు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితను కాపాడడానికి బిజీగా ఉన్న మంత్రులు, పాలకులు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రక్షాళన జరిగేవరకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు ఆయన.

రాజకీయ నాయకులకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ మెంబర్లుగా ఎలా నియమిస్తారని మండిపడ్డారు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పేపర్ లీకేజీ కేసులో ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబీకుల హస్తం ఉందని ఆరోపణ చేశారు. సిట్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తుందని వ్యాఖ్యానించారు ఆయన. శంకరలక్ష్మితో సహా కేసులో భాగస్వాములైన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు ఆయన.

నిందితులకు ప్రాణాపాయం కలగకుండా కాపాడి, లీకేజీ వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేసారు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిందితుల ఫోన్లను గత నాలుగు నెలల ముందునుంచి కాల్ డాటా పరిశీలించి కేసులో ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేసారు ఆయన. గవర్నర్ కూడా పేపర్ లీకేజీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని,  30 లక్షల మందికి  న్యాయం చేయాలని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, చైర్మెన్ ను తొలగించే వరకు, కేసును సిబిఐకి అప్పగించేవరకు బిఎస్పి పోరాటం ఆగదని స్పష్టం చేసారు ప్రవీణ్ కుమార్. బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు మాయవతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 12 లక్షల ఉద్యోగాలిచ్చారని ఒక్క లీకేజీ, కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసారు ఆయన.

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు దయానందరావు, అనిత రెడ్డి, డా.వెంకటేష్ చౌహాన, మౌలానా షఫి, డా.సాంబశివగౌడ్, అరుణ క్వీన్, అర్షద్ హుస్సేన్ పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking