Take a fresh look at your lifestyle.

డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ప్రభుత్వానికి భయమెందుకు..?

0 14

డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే

ప్రభుత్వానికి భయమెందుకు..?

బహుజన సమాజ్ పార్టీ స్టేట్ బాస్ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ప్రభుత్వం భయ పడుతుందా..? తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఔను అంటున్నారు పరిశీలకులు. రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ గా మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట. టీఎస్ పీఎస్ సి పరీక్ష పేపరుల లీకేజ్ కేసులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను ఐక్యం చేసి ఆందోళన చేయడం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ – ప్రొ. కోదండరాం హౌజ్ అరెస్ట్..

ఆగష్టు నెలలో జరిగే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు బీఎస్ పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. నిరుద్యోగుల కోరిక మేరకు పరీక్షలు వాయిదా వేయనట్లయితే శనివారం  అమరవీరుల స్థూపం వద్ద నిరహరదీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే.. పోలీసులు ఉదయం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అలాగే టీజెస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా నిరుద్యోగులకు మద్దతుగా అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేస్తామని ప్రకటించడంతో అతనిని కూడా హౌజ్ అరెస్ట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking