Take a fresh look at your lifestyle.

ఆర్మూర్ ఎంజె ఆసుపత్రి డాక్టర్ మధుశేఖర్ కు చైర్మన్ పదవి

0 23

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్&ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్మన్ గా డా.మధు శేఖర్

నిజామాబాద్, ఆగష్టు 17 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్మన్ గా డా. మధు శేఖర్ నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మధుశేఖర్ ఆర్మూర్ లో చేయూత స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు.

వైద్యరంగంలో విశేష అనుభవం కలిగిన చైర్మన్ డా. మధు శేఖర్ ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్&ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ గా ఎంపిక చేయడం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని డా. మధు శేఖర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డా. మధు శేఖర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ మధుశేఖర్ భాయ్ కంగ్రాట్స్..

– యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking