Take a fresh look at your lifestyle.

ఇంటింటా సీనియర్ సిటీజన్స్ కార్డుల పంపిణీ

0 181

సీనియర్ సిటీజన్స్ కార్డుల పంపిణీ

జగిత్యాల : తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 60 ఏళ్ళు పై బడిన వయోవృద్ధుల (సీనియర్ సిటీజన్స్)కు జిల్లా సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ ద్వారా సిఫార్సు చేయబడిన, జిల్లా సీనియర్ సిటీజన్స్ సంక్షేమ శాఖ  వారిచే జారీ చేయబడిన గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం ,ప్రకాష్, హన్మంత రెడ్డి,బొల్లం విజయ్,ఎం.డి.యాకూబ్ తదితరులు జగిత్యాల జిల్లా కేంద్రం లో  గురువారం ఇంటింటా తిరుగుతూ సీనియర్ సిటీజన్స్ కు ప్రభుత్వ గుర్తింపు కార్డులు  అందజేశారు.గుర్తింపు కార్డులు తమ అసోసియేషన్ ను సంప్రదిస్తే ఉచితంగా అందజేస్తామని ,ఈ కార్డుతో  విమాన ప్రయాణం లో రాయితీ, దేవాలయాల్లో ప్రత్యేక ఖ్యూ లైన్, తదితర రాయితీలు పొందవచ్చని వారు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు పి.ఆశోక్ రావు,బోబ్బాటి కరుణ,బి.రాజేశ్వర్,పబ్బా శివానందం,రాజ్ మొహన్,సైఫోద్దీన్,విట్ఠల్,గంగరెడ్డి,గంగాధర్,ఉప్పుగళ్ల మురళీధర్,మనోహర్ రావు,మధుసూదన రావు,రాజ్ గోపాల్ చారి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking