Take a fresh look at your lifestyle.

సైబర్ నేరగాళ్ళ వలలోపడి మోసపోవద్దు

0 287

మోసపూరిత ఆన్లైన్ ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి

సైబర్ నేరగాళ్ళ వలలోపడి మోసపోవద్దు..

– జిల్లా ఎస్పీ  కె. రఘువీర్ రెడ్డి

నంద్యాల,మార్చి 8 :  సైబర్ నేరాలపై ప్రజలు అప్రమాత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు నంద్యాల జిల్లా ఎస్పీ  కె.రఘువీర్ రెడ్డి.  బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నా… ఆశపడి ఆకర్షితులైతే సైబర్ నేరగాళ్ల చేతిలో  నిలువుదోపిడికి గురయ్యే అవకాశం ఉందని, అలాగే మోసపూరిత ఆన్లైన్ ట్రేడింగ్లో డబ్బులు పెట్టి మోసపోవద్దని, డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి.

సైబర్ మోసం జరిగిన వెంటనే నంద్యాల సైబర్ ల్యాబ్ కు లేదా  1930 కి కాల్ చేస్తే మోసపూరిత డబ్బు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా ఫ్రీజ్ చేయవచ్చు, లేదా l ఎన్ సి ఆర్ పి ప్రోటల్ (డబ్ల్యు డబ్ల్యు . సైబర్ క్రైమ్. గో వి.ఇన్) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు.

మీ బ్యాంక్ అక్కౌంట్ నెంబర్ ను మరియు  ఓటిపి (ఒన్ టైమ్ పాస్వర్డ్ )ను ,మీ బ్యాంక్ పిన్ నెంబర్ ను , సిసివి నెంబర్ ను ఈ సున్నితమైన వివరాలను ఎవరితోనైనా పంచుకోవడం వలన మీ ఖాతా ఖాళీ చేసే అవకాశం ఉంటుంది .కావున నంద్యాల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ  తెలియజేశారు.
తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని కాల్/మెసేజ్ చేస్తూ ఉంటారు. తెలియని ఆన్లైన్ లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి.
బ్యాంక్ వినియోగదారుల సేల్ నెంబర్ కి వచ్చే  ఓటిపి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ, తెలియని వారితో ఓటిపి పంచుకోవద్దు .బ్యాంక్ వినియోగదారులకు బ్యాంక్ అధికారులు ఎలాంటి సందర్భాల్లో మొబైల్ ద్వారా సంప్రదించి వివరాలు అడగరు అని దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అని వచ్చే ఎలాంటి కాల్స్ కి సమాధానం ఇవ్వకూడదు.
బ్యాంకు రుణాల పేరుతో తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లాంటివి అడిగినప్పుడు సమాధానం చెప్పకూడదు.
తెలియని వ్యక్తుల నుండి మెసేజ్ లలో, మెయిల్స్ లలో వచ్చిన తెలియని లింకులపై మరియు సామజిక మాధ్యమాలలో వచ్చే లింక్స్ ని క్లిక్ చేసి మోసపోవద్దు.

బలమైన పాస్‌వర్డ్: యూజర్లు పాస్‌వర్డ్‌ లను ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉండాలి. దీనివల్ల ఇతరులు సులభంగా పాస్‌ వర్డ్ ను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది. సోషల్ మీడియా సైట్లలో అయితే వాటి పాస్‌వర్డ్ పాలసీకి అనుగుణంగా బలమైన పాస్‌వర్డ్ లను ఉపయోగించాలి. వివిధ రకాల ఆన్‌లైన్ అకౌంట్ల కోసం విభిన్న పాస్‌వర్డ్స్ పెట్టుకోవాలి. అన్నింటికీ ఒకటే పాస్‌వర్డ్ ను పెట్టకూడదు. ఈ జాగ్రత్తలు కూడా యువతులు, మహిళలు తప్పక జాగ్రత తీసికోవాలి . అకౌంట్ సెక్యూరిటీ స్థాయిలను ఎప్పటికప్పుడూ పరిశీలించుకోవాలి. యూజర్లు తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. సమాచారాన్ని పరిమితంగానే షేర్ చేయాలి. అసభ్యకరంగా మెసేజ్‌లు చేసేవారు, సైబర్ వేధింపులకు పాల్పడేవారి అకౌంట్లను బ్లాక్ చేయాలి. అవసరమైతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి.

గమనిక :- ప్రస్తుత పరిస్థితులలో ప్రతి విధమైన లావాదేవీలు వివిధ ఆన్లైన్ యాప్ ల ద్వారా జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ  జాగ్రత్తగా ఉండి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని మరియు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సున్నితమైన విషయాలను అనగా ఓటీపీ ,పాస్వర్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ,సిసివి నంబర్స్ , తెలియని వ్యక్తుల నుండి మెసేజ్ లలో, మెయిల్స్ లలో వచ్చిన తెలియని లింకులపై మరియు సామజిక మాధ్యమాలలో వచ్చే లింక్స్ ని క్లిక్ చేసి మోసపోవద్దు.  మరియు ఆన్లైన్ ట్రేడింగ్ ల  ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మోసాలు జరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఫైబర్ నేరగాళ్ల వలలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ   తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking