Take a fresh look at your lifestyle.

దుబాయ్ లో కూలీలకు నిత్యవసర సరుకుల పంపిణీ

0 38

యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో

దుబాయ్ లో వలస కూలీలకు నిత్యవసర సరుకుల పంపిణీ

దుబాయ్, ఏప్రిల్ 18 : బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన తెలుగు వారే ఎక్కువ. పుట్టిన ఊరును, భార్య, పిల్లలను వదిలి అధిక డబ్బులు సంపాదించాలని విదేశాలకు వెళ్లుతారు చాలా మంది. ఇగో.. పవిత్ర రంజాన్ మాసములో కార్మిక సోదరులకు తెలుగు అసోసియేషన్ (tauae.org)  వారు రంజాన్ పండుగ సందర్భంగా వలస కూలీలకు సహాయం చేయాలని నిర్ణయించారు.

“నిత్యావసర వస్తువుల పంపిణీ” కార్యక్రమాన్ని దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ కాంప్ నందు నిర్వహించారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, పళ్ళు మొదలగు నిత్యావసర సరుకులతో కూడిన కిట్స్ పంపిణీ చేయటం జరిగింది.

తెలుగు అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సహాయానికి కార్మిక సోదరులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, హృదయపూర్వక కృతఙ్ఞతలను తెలియజేసారు. మున్ముందు కూడా ఈ సేవ కొనసాగాలని తమ ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్లు శ్రీ రవి ఉట్నూరి గారు మరియు సాయి ప్రకాష్ సుంకు గారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ విజయ భాస్కర్ గారు, భీం శంకర్ గారు, శరత్ చంద్ర గారు, శ్రీమతి వుషా దేవి గారు, శ్రీమతి లతా నగేష్ గారు కీలక భాధ్యతలు నిర్వహించారు.

తెలుగు అసోసియేషన్ అద్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన గారు, ఉపాద్యక్షుడు మసిఉద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా గారు, వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు యండూరి గారు, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేద్కర్ గారు, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల గారు, ఫహీమ్ గారు, మోహన  కృష్ణ గారు, Ch. శ్రీనివాస్ గారు, చైతన్య గారు కార్యక్రమానికి విచ్చేసిన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking