Take a fresh look at your lifestyle.

సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో టి షర్ట్స్, నోట్ పుస్తకాల పంపిణీ

0 18

మానవతాసదన్ చిన్నారులకు

ఉచితంగా టి షర్ట్స్, నోట్ పుస్తకాల పంపిణీ

పేదలకు సేవా చేయాలంటే పదవులు అవసరం లేదు. మంచి మనసు ఉంటే సరి పోతుంది. సిరికొండ సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు నర్సయ్య కూడా ఆపదలో ఉన్నోళ్లకు సాధ్యమైనంతా సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. విద్యాతోనే జీవితాలలో మార్పు వస్తుందని భావించే నర్సయ్య పేద విద్యార్థులకు సహాయం చేయడం అంటే అతనికి భలే ఇష్టం.

ఇగో.. సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి మానవతాసదన్ లోని చిన్నారులకు టి షర్ట్స్, నోట్ పుస్తకాలు (రూ. 25000/- విలువ గల ) ఉచితంగా అందజేసారు.

విద్యార్థులను ఉద్దేశించి సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ చదువుతోనే ప్రగతి సాధ్యమని, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు.

సమాజంలో మానవతా దృక్పధం కల్గిన వారందరు మీకు అండగా ఉంటారని మానసికంగా ఎవరు కృంగి పోకుండా ఉన్నత లక్ష్యం నిర్దేశించుకొని క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు.

ఈ కార్యక్రమంలో  డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య, ఘన్ పూర్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ కుమార్, మానవతా సదన్ లైసనింగ్ అధికారి సుధాకర్ రావ్ నిర్వాహకులు రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking