Take a fresh look at your lifestyle.

ఒమ‌న్‌లో భార‌త‌ రాయ‌బారితో WTITC భేటీ

1 102

ఒమ‌న్‌లో భార‌త‌ రాయ‌బారితో WTITC భేటీ

– ఒమన్ రాజకుటుంబీకుల తెలుగు రాష్ట్రాల పర్యటనపై చర్చ

– WTITC కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ‌కు రాయబార కర్యాలయం మద్ధత్తు

– ఒమన్ లోనూ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచన

– లేబ‌ర్ క్యాంపుల్లో నివసిస్తున్న తెలుగువారి సమస్యలను

రాయబారి దృష్టికి తీసుకెళ్లిన సందీప్ మ‌ఖ్త‌ల

ఒమ‌న్‌/ హైద‌రాబాద్‌, ఏప్రిల్ 13, 2023: ఒమ‌న్ దేశ పర్య‌ట‌న‌లో భాగంగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక సంగం (WTITC ) అధ్య‌క్షుడు సందీప్ కుమార్ మ‌ఖ్త‌ల భార‌త రాయ‌బారి అమిత్ నారంగ్‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఒమ‌న్‌ – తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌ ఐటీ ప‌రిశ్ర‌మ వృద్ధి అంశాల‌తో పాటుగా స్టార్ట‌ప్‌ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు. ఒమాన్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యంలో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్ నిర్వ‌హ‌ణ చేప‌ట్టాల‌ని సూచించారు. ఒమ‌న్‌లో ఉన్న లేబ‌ర్ క్యాంపుల‌లోని వారి స‌మ‌స్య‌ల‌ను గురించి సైతం ప్ర‌స్తావించి భార‌త రాయ‌బార కార్యాల‌యం త‌ర‌ఫున వాటి పరిష్కారానికి కృషి చేయాల‌ని కోరారు.

ఒమ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఒమ‌న్ సుల్తానేట్‌లో భార‌త రాయ‌బారి అమిత్ నారంగ్‌తో భార‌త రాయ‌బార కార్యాల‌యంలో WTITC అధ్య‌క్షుడు సందీప్ మ‌ఖ్త‌ల మరియు బృందం దాదాపు గంట పాటు స‌మావేశం అయారు. ఒమ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యువ‌రాజుతో స‌మావేశం అయిన వివ‌రాలు తెలియ‌జేయ‌డంతో పాటు ఒమ‌న్ రాజ‌కుటుంబీకులు త‌మ ఆహ్వానం మేర‌కు తెలుగు రాష్ట్రాలలో ప‌ర్య‌టించ‌నున్న వివ‌రాల‌ను వివ‌రించారు. దీంతోపాటుగా ఒమ‌న్ – తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సంబంధాల‌పై రాజ‌కుటుంబీకుల ఆస‌క్తిని తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా భార‌త రాయ‌బారి అమిత్ నారంగ్ మాట్లాడుతూ ఒమన్ – భార‌త‌దేశం మ‌ధ్య ఉన్న మంచి సంబంధాలున్న నేప‌థ్యంలో వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ఈ ఒమ‌న్‌లో కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు వివ‌రించారు. ఎగుమ‌తుల‌కు ప‌న్ను మిన‌హాయింపులు, స్టార్ట‌ప్‌ల‌కు ప్ర‌యోజ‌నాలు, ఐటీ కంపెనీల‌కు ఉన్న అవ‌కాశాల గురించి వివ‌రించారు. భార‌త రాయ‌బార కార్యాల‌యం వేదిక‌గా WTITC కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు అమిత్ నారంగ్ అంగీక‌రించారు. వ‌చ్చే జూన్‌లో ఒమ‌న్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ సంస్థ‌లతో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని భార‌త రాయ‌బారి కోరారు.

రాయ‌బారితో స‌మావేశానికంటే ముందు మ‌స్క‌ట్‌, సోహార్ న‌గ‌రాల లేబ‌ర్ క్యాంప్‌ల‌ను సంద‌ర్శించిన సందీప్ మ‌ఖ్త‌ల బృందం ఈ సంద‌ర్భంగా త‌మ దృష్టికి వ‌చ్చిన ప‌లు అంశాల‌ను భార‌త రాయ‌బారితో వెల్ల‌డించారు. లేబ‌ర్ క్యాంపుల‌లోని వారికి చెందిన వివిధ స‌మ‌స్య‌ల‌ను హిస్ హైనెస్ అల సయ్యిద్ ఫైరస్ ఫాతిక్ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు పేర్కొంటూ భార‌త ప్ర‌భుత్వం ప‌రంగా రాయ‌బారి అందించ‌గ‌లిగే స‌హాయ స‌హ‌కారాల‌ను ప్ర‌స్తావించారు. వీటిప‌ట్ల సానుకూలంగా స్పందించిన భార‌త రాయ‌బారి ప‌రిష్కారానికి త‌మ వంతు కృషి చేస్తామ‌ని వెల్ల‌డించారు. భార‌త రాయ‌బారిని క‌లిసి వారిలో రిట్జ్ గ్రూప్ అధినేత ఎంఎన్ఆర్ గుప్త, ఎస్ఎస్ఆర్ క్లౌడ్ అధినేత శశిధర్ శర్మ, WTITC సభ్యులు కరీం షేక్, హేమంత్ సర్వబొట్ల, అభిషేక్ రెడ్డి అర్రబోలు ఉన్నారు.

1 Comment
  1. BnhfuirTiext says

    место территориальный орган МВД России на региональном уровне Нижний Новгород Ижевск Балашиха Волжский Череповец Вологда Орск Бийск Березники Каспийск Камышин Постоянная Прописка В Паспорт

Leave A Reply

Your email address will not be published.

Breaking