Take a fresh look at your lifestyle.

మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు

0 13

మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు

హైదరాబాద్, మే 30 : హైదరాబాద్‌లోని మెడిసిటీ మెజికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. 2023-24 అడ్మిషన్లు నిలిపివేయాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మెడికల్ కాలేజీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందినదిగా భావిస్తున్నారు. మెడిసిటీ మెడికల్ కాలేజీ హైదరాబాద్ శివారులో కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ నిర్వహిస్తోంది. నిబంధనల ప్రకారం ఆస్పత్రిని కూడా నిర్వహించాలి. ఇటీవలి కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం కాలేజీ నిర్వహించడం లేదన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లాయి. దీంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో లోపాలు బయటపడటంతో.. ఈ విద్యా సంవత్సరానికి మెడికల్ సీట్లను భర్తీ చేయకుండా నిషేధం విధించింది

Leave A Reply

Your email address will not be published.

Breaking