Take a fresh look at your lifestyle.

వివేకా హత్య కేసులో దస్తగిరినీ  అప్రూవర్ గా మారడంపై…

0 183

తెలంగాణ హైకోర్టు లో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్

హైదరాబాద్, మార్చి 20: వివేక హత్య కేసు లో ఏ-4 దస్తగిరినీ  అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేసారు. దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లను విచారించారు సిబిఐ అధికారులు. దస్తగిరినీ  అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసారు వైఎస్ భాస్కర్ రెడ్డి.

దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. సిబిఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్ మెంట్ ఇస్తున్నాడని తమకు వివేకారెడ్డి హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.

అయితే.. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషిస్తున్నారు. కీలక పాత్ర పోషించిన దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే. దస్తగిరి బెయిల్ సమయంలోను సిబిఐ సహకరించిందని పేర్కొన్నారు. దస్తగిరి పై ఉన్న ఆధారాలను కింది కోర్ట్ పట్టించుకోలేదు. దస్తగిరి కి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking