Take a fresh look at your lifestyle.

గద్దర్ పై వివాదస్పద పోస్ట్..

0 19

గద్దర్ పై వివాదస్పద పోస్ట్..

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు

గద్దర్.. బడుగు బలహీన వర్గాల గొంతుక.. అతను పాడిన విప్లవ పాట తూపాకి తూట కంటే పదునైనది. తరతరాలుగా అణచబడుతున్న జాతి కోసం నక్సలైట్ ఉద్యమ బాట పట్టిన గద్దర్ పై రాజ్యాంగం తుపాకి గుళ్లు కురిపించిన ఉద్యమం ఊపీరిగా పాటనే ప్రాణంగా తుది శ్వాష వరకు విప్లవ గీతాలు వినిపించిన గద్దర్ పై సోషల్ మీడియాలో వివాదస్పద పోస్ట్ పెట్టారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన సాగర్. అతని పోస్ట్ చూసిన దళిత బిడ్డ సుధర్శన్ ఘాటుగా స్పందించారు. బాధతో అతను పెట్టిన వాయిస్ మెస్సెజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివాదస్పద పోస్ట్ ఇదే..

‘‘ఎంతో మంది పిల్లల తల్లిదండ్రుల ఉసురు పోసుకుని పోయాడు గద్దర్. ఉద్యమం పేరుతో ఎంతో మంది తల్లిదండ్రుల కడుపు కోతకు కారకుడు గద్దర్ గుండె పోటుతో మరణించారు. తన పిల్లలను మాత్రం సేప్ గా పెంచాడు.’’ సోషల్ మీడియాలో సాగర్ పెట్టిన పోస్ట్ ను చదివిన దళితులు, గద్దర్ అభిమానులు, విప్లవ పాటను ఇష్ట పడే వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మానవుణ్ణి మరో మానవుడు దోపీడి చేయని వ్యవస్థ కోసం తుపాకి గుళ్లను శరీరంలో దాచుకుని విప్లవ పాటలు వినిపించిన గద్దర్ ను విమర్శించే స్థాయి సాగర్ కు లేదని వారంటున్నారు.

గౌరవంగా బతుకుతున్నామంటే

గద్దర్ పాటనే..

గద్దర్ పై సాగర్ పెట్టిన వివాద స్పద పోస్ట్ గురించి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రానికి చెందిన ప్రగతి వీడియా మిక్సింగ్ సెంటర్ యజమాని సుధర్శన్ ఘాటుగా వాయిస్ మెస్సెజ్ తో సమాధానం ఇచ్చారు. వ్యక్తిగతంగా సాగర్ తో పరిచయం ఉన్న సుధర్శన్ దళితుల బతుకులు మారడానికి గద్దర్ చేసిన త్యాగాలను గుర్తు చేస్తునే తీవ్రంగా పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐడియా సాగర్ పోస్ట్ కు ఇదే సమాధానం

సుధర్శన్ వాయిస్ మెస్సెజ్ ఇదే..

 

Leave A Reply

Your email address will not be published.

Breaking