Take a fresh look at your lifestyle.

కోరుట్ల కోర్టులో సిమెంట్ బెంచీల ఏర్పాటు

0 14

కోరుట్ల కోర్టులో సిమెంట్ బెంచీల ఏర్పాటు

కోరుట్ల, మే 16 : లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల సౌజన్యంతో స్థానిక కోర్టు ఆవరణంలో కోర్టు కు హాజరయ్యే కక్షీదారులు కూర్చోవడానికి సౌకర్యార్థం సిమెంట్ బెంచ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గుంటుక చంద్రప్రకాష్, కోరుట్ల లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గండ్ర అజయేందర్ రావు, గుంటుక మహేష్, రీజియన్ ఛైర్మెన్ లయన్ ఉషాకిరణ్ ,జోన్ ఛైర్మెన్ లయన్ చాప వందన, మాజీ రీజియన్ ఛైర్మెన్ చాప కిషోర్ తెలిపారు.

కోరుట్ల కోర్టు లో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సభ్యులకు కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బద్ది నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బైరి విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు… భవిష్యత్ లో లయన్స్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో ఆవసరార్థుల అవసరాలు తీర్చాలని, ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరి విజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు లయన్స్ క్లబ్ సభ్యులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ మురళి, బార్ అసోసియేషన్ న్యాయవాదులు,కక్షీదారులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking