Take a fresh look at your lifestyle.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చిందేది..?

0 13

తెలుగురాష్ట్రాల ఎన్నికల్లో కీలక హామీగా ఫ్రీ బస్ జర్నీ

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చిన

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

హైదరాబాద్ జూన్ 3 : కర్ణాటక ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ నినాదం మహిళల్ని పెద్ద ఎత్తున ఆకర్షించటమే కాదు.. దీనికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలకు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఖర్చు తక్కువ.. ప్రచారం ఎక్కువ. దీనికి తోడు మహిళల మనసుల్ని దోచుకోవటం ద్వారా.. వారి ఓట్లను ఖాయంగా పొందొచ్చన్న భావన ఇప్పుడు ఏపీలోని రాజకీయ పార్టీల ఆలోచనగా చెబుతున్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు భారీగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వినూత్నంగా.. ఒక సెక్షన్ ఓటర్ల మనసుల్ని దోచేందుకు ఉచిత బస్సు ప్రయాణం హామీ పనికి వస్తుందన్న భావన ఎక్కువ అవుతోంది.

కర్నాటకల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీ ఎన్నికల విజయంలో కీలకంగా మారిన నేపథ్యంలో.. రానున్న ఏడాది వ్యవధిలో జరిగే తెలంగాణ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీ కీలకంగా మారుతుందని చెబుతున్నారు.ఫ్రీ అన్న ఉద్దేశంతో మహిళలు అదే పనిగా బస్సుల్లో ప్రయాణించే వీలు ఉండదని.. మిగిలిన సంక్షేమ పథకాలు కొన్ని వర్గాలకు.. కొందరికి మాత్రమే పరిమితం కావటం.. అందుకు భిన్నంగా మహిళలు మొత్తానికి ఈ పథకం అమలు కావటం..

ఆ వర్గం వారి ఓట్లను ఆకర్షించే వీలుందని చెబుతున్నారు. మొత్తం ఓట్లలో యాభైశాతానికి కాస్త అటు ఇటుగా ఉండే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీ ఖాయమని చెబుతున్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీకి కాస్తంత అప్ గ్రేడ్ చేసి.. పెద్ద వయస్కులకు (60 ఏళ్లు దాటిన వారికి) ఉచిత ప్రయాణం అని పేర్కొంటే.. మరింత త్వరగా ఆకర్షించే వీలు ఉంటుందంటున్నారు.స్లీపర్.. ఏసీ బస్సుల్లోనూ ఈ వర్గాల వారికి యాభై శాతం రాయితీ ఇస్తామని చెబితే.. పెద్ద ఎత్తున ఓట్లు పడేందుకు వీలు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

రోడ్డు రవాణా సంస్థను సమర్థంగా నడపాలే కానీ ఈ ఉచిత హామీతో ప్రభుత్వం మీద పడే భారం తక్కువే అన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ హామీని రాజకీయ పార్టీలు ప్రకటించేందుకు వీలుగా చర్చలు జరుగుతున్నట్లుగా చెబుతుున్నారు. ఇప్పటికే ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు సందర్భంగా ప్రకటించిన ఉచితాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రకటించటం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking