Take a fresh look at your lifestyle.

ఈడి ఆఫీస్ కి బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు

0 91

ఎమ్మెల్సీ కవితాతో వాట్సాప్ చాటింగ్ పై ఈడీకి ఫిర్యాదు

హైదరాబాద్, ఏప్రిల్ 12 (వైడ్ న్యూస్) బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బుధవారం నాడు ఈ డీ కార్యాలయానకి వెళ్లారు. సుకేష్ చంద్రశేఖర్ తెలంగాణ ప్రభుత్వ పెద్దల తో వాట్సాప్ చాట్స్ ఫై ఈడీ కి ఫిర్యాదు చేశాను. పెద్ద నొట్ల రద్దు తరువాత 2 లక్షల కు మించి ట్రాన్సాక్షన్ జరిగితే దానిమీద విచారణ జరపాలి. టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పార్క్ చేసి ఉన్న 6060 నంబర్ రేంజ్ రోవర్ కార్ లో డబ్బులు పెట్టానని చెప్పాడు.

ఆ కార్ ఎవరిది అనేది అధికారులు ఎందుకు బయట పెట్టట్లేదు.తెలంగాణ భవన్ లోకి ఎన్ని సార్లు 6060 రేంజ్ రోవర్ కార్ వచ్చింది ఉన్నతాధికారులు బయట పెట్టాలి. ఐదు దఫాలుగా సుఖేష్ తెలంగాణ భవన్ కి వచ్చి 15 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఒక పార్టీ కార్యాలయంలో లిక్కర్ స్కాం వ్యవహారంలో నేరారూపణ కలిగిన వ్యక్తి ఎందుకు వచ్చాడు దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి.

ఒకవేళ అదంతా అబద్ధం అయితే బయటికి వచ్చిన వాట్సాప్ చాటింగ్ నిజం కాదని ఎందుకు చెప్పట్లేదు. మనీ లాండరింగ్ కింద కిందు దీన్ని విచారణ చేపట్టాలి. సుఖేష్ కి కవితకి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ప్రింట్లు వాళ్లకి అందించామని అన్నారు.

దాన్ని విచారించి అది నిజమైనదా కావాలని చేసిందా విచారిస్తాము అని అధికారులు అన్నారు. ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి ,ఎవరు వాడుతున్నారు, గతంలో ఎవరు వాడారు ఇవన్నీ విచారణ జరుగుతామన్నారు.
6060 నెంబర్ గల కార్ వివరాలు రోడ్డు రవాణా శాఖ అధికారులు బయట పెట్టాలి. తెలంగాణ భవన్ కు వచ్చిన సిసిటీవి కెమెరా ల దృశ్యాల ను విడుదల చేయాలి. ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించారని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking