Take a fresh look at your lifestyle.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వక పోతే.. ఆమె అరెస్టు అసాధ్యం..?

0 37

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత..

  • 26న విచారణకు రావాలని సీబీఐ నోటీసు
  • సీబీఐ కోర్టు అనుమతి లేకుండా కవిత అరెస్టు కష్టమే..
  • సీబీఐ విచారణకు డుమ్మా కొడుతున్న కవిత
  • పీఏ వాంగ్ములంతోనే కవిత మెడకు బిగిస్తున్న ఉచ్చు

(యాటకర్ల మల్లేష్ )

ప్రభుత్వం మనదైతే.. అక్రమంగా ఆస్తులు సంపాదించడానికి మార్గాలు ఎన్నో.. కల్వకుంట్ల కవిత కూడా తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని కోట్లు ఆర్జించారనేది టాక్. ఇగో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కోట్లు సంపాదించిన ఆరోపణలతో కవిత జైలు కూడు తింటుందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ ప్రారంభమైంది.

జోరు మీదున్న సీబీఐ..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు కూడా పంపించింది సీబీఐ. ఈ నెల 26న విచారణకు రావాలని సెక్షన్ 41ఏ కింద ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కవితను అరెస్టు చేయాల్సి వస్తే ఈ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు న్యాయ నిపుణులు. కవిత అరెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వాల్సి  ఉంటుందని చెబుతున్నారు.


ఈడీ విచారణలో కూడా ఇలాగే..

గతంలో ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి పిలిపించి టీవీ సీరియల్ ను మించి విచారణ జరిపి చివరకు అరెస్టు చేయక పోవడం రాజకీయాలలో పెద్ద దుమారం రేగింది. కవితను అరెస్ట్ చేయక పోవడం వెనుక బీజేపీ – బీఆర్ ఎస్ లు ఒక్కటయ్యాయని, అందుకే కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు కాలేదని కామన్ మెన్ సైతం అంగీకరిస్తారు.

కవిత అరెస్టు అనుమానమే..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు రావాలని సెక్షన్ 41ఏ కింద కవితకు నోటీసులు ఇవ్వడం ద్వారా ఆమెను అరెస్టు అనుమానమే అంటున్నారు న్యాయ నిపుణులు. ఈడీ కోర్టు ముందు కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న సంబందాలను చూపించి అరెస్ట్ కు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కవితను ఈడీ అధికారులు విచారణ జరిపినప్పుడు కూడా అరెస్ట్ చేయక పోవడానికి కోర్టు అరెస్ట్ అనుమతి ఇవ్వక పోవడమే అంటున్నారు. కవితను అరెస్టు చేయడానికి సీబీఐ కోర్టులో ఫిటిషన్ కూడా వేసినట్లు విశ్వాషనీయ వర్గాల ద్వారా తెలిసింది.

సీబీఐ విచారణకు కవిత డుమ్మా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఈనెల 26న సీబీఐ ముందుకు విచారణకు వెళ్లితే అరెస్టు చేసే అవకాశం ఉన్నందున న్యాయవాది ద్వారా సుప్రీం కోర్టులో కేసు కొనసాగుతుందని కారణం చూయించి తప్పించుకోవాలని వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

నోటిసులు, విచారణ విషయంలో సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చేంత వరకు తాను విచారణకు హాజరుకాబోనంటూ ఇప్పటికే కవిత తేల్చి చెప్పింది. కాగా.. ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నోటీసులకు కూడా వెళ్లనంటున్నారు కవిత. ఇదిలా ఉంటే.. ఈడీ నోటీసుల కేసుపై ఈనెల 28న సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో.. సీబీఐ విచారణకు కవిత గైర్హాజరుకానున్నారు. అయితే.. ఇది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. గతంలో కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్దే విచారించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. కాగా.. వాళ్లు ఇచ్చిన స్టేట్ మెంట్లను ఆధారంగా చేసుకునే.. కవితను నిందితురాలిగా పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. మాగంటి రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, కవిత పీఏ అశోక్ కౌశిక్ అప్రూవర్లుగా మారిపోయిన విషయం తెలిసిందే.

జడ్జీ ముందు కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్ములంతోనే…

ఇందులో కవిత పీఏ అశోక్ కౌశిక్.. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను న్యాయమూర్తి ముందు బయటపెట్టినట్టు తెలుస్తోంది. లిక్కర్ కేసులో కవితతో పాటు పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు స్టేట్ మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. దీంతో.. కవితతో పాటు అశోక్ కౌశిక్‌ని కూడా సీబీఐ నిందితులుగా పరిగణిస్తోంది.

ఇప్పుడు ఏం జరగబోతోంది..?

దీంతో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పుడు ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే.. సీబీఐ ఇచ్చిన నోటీసులతో లిక్కర్ స్కాం కేసులో కవిత చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుస్తున్నట్టు అర్థమవుతోంది. విచారణకు హాజరైతే.. సాక్ష్యాలతో సహా విచారణ జరిపి అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పాటు.. విచారణకు హాజరుకాక పోయినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు.

ఈడీ విచారణకు వెళ్లినప్పుడు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు కవిత ఢిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా అక్కడే మాకం వేశారు. ఆమెకు మానసికంగా ధైర్యం ఇవ్వడానికి మంత్రులు, పార్టీ ముఖ్యులు, కార్పొరేట్ చైర్మన్ లు, ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోనే ఉన్నారు. అయితే.. మారిన రాజకీయాలతో కేసీఆర్ ప్రతిపక్షా హోదాకు పరిమితం అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ గూటికి వెళ్లడానికి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సైతం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కవితను సీబీఐ అరెస్టు చేసినా సానుభూతి పెద్దగా ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకు 26న ఏమి జరుగుతుందో ఎదురు చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking