Take a fresh look at your lifestyle.

జీవో 111 రద్దు.. ఇంకా విధి విధానాలపై రాని క్లారిటీ

0 13

జీవో 111 రద్దు.. ఇంకా విధి విధానాలపై రాని క్లారిటీ

హైదరాబాద్, మే 27 : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు జీవో 111తో రెండు దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోద ముద్ర వేశారు. దీంతో జీవో పరిధిలోని గ్రామాల్లో సంబరాలు, సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేశారు.

అంత వరకు ఓకే.. కానీ.. స్థానిక ప్రజలను అనేక అనుమానాలు వేధిస్తున్నాయి.జీవో ఎత్తివేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారు? గ్రీన్ జోన్ పరిధిలో ఏయే గ్రామాలను ఎంపిక చేస్తారు? గ్రీన్ జోన్ పరిధిని ఏ ప్రాతిపాదికన నిర్ణయిస్తారు? జంట జలాశయాలపైన ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు జలాశయాల్లో కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వెలిశాయి.

వాటికి అనుమతులు ఎలా ఇస్తారు?  ట్రిపుల్ వన్ జీవో రద్దు తర్వాత.. కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది.  గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్‌గా నిర్ధారించే అవకాశాలున్నాయి. గ్రీన్ జోన్‌లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతించే అవకాశం లేదు. ఇక మురుగునీరు జంటజలాశయాల్లో కలవకుండా 11 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. గండిపేట జలాశయం చుట్టూ 5, హిమాయత్ సాగర్ జలాశయం చుట్టూ 6 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

జంట జలాశయాల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు ఆందోళణ చెందాల్సిన పనిలేదని మాత్రం చెబుతున్నారు లోకల్ ఎంపీ రంజిత్ రెడ్డి చెబుతున్నారు.ఇక మొయినాబాద్, శంకర్ పల్లి, శంషాబాద్ మండలాల్లో ఇప్పటికే చాలా వరకు HMDA అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్లు భారీగా వెలిశాయి. వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది.  HMDA పరిధిలో దాదాపుగా పది వేల ఎకరాల్లో అక్రమ వెంచర్లు వెలిసినట్లు ప్రాథమిక అంచనా. 111 జీవో నేపథ్యంలో ఆ ప్లాట్లను ఇన్నాళ్లు నిషేధిత జాబితాలో ఉంచారు.  వాటికి సంబంధించి నోటరీతో ఇన్నాళ్లు సరిపెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేయలేదు. జీవో రద్దు ప్రకటన తర్వాత. విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking