Take a fresh look at your lifestyle.

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు బయట పెట్టాలి : బీఎస్పి

0 13

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు బయట పెట్టాలి

: బీఎస్పీ డిమాండ్

హైదరాబాద్, మే 20 : వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు  బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. శనివారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు, ధరణి పోర్టల్‌, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, అక్రమ లే అవుట్లు, ప్లాట్లు, గ్రామ కంఠం భూముల క్రమబద్ధీకరణకు వేసిన మంత్రివర్గ ఉపసంఘాలు సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆదివాసీ,గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.రెవిన్యూ అధికారుల తప్పిదాల వల్ల ధరణి పోర్టల్ లో లక్షలాది ఎకరాల పేదల అసైండ్ భూములు నిషేధిత జాబితాలో నమోదయ్యాయని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న లక్షల ఎకరాల అసైన్డ్ భూములను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్స్ ను త్వరగా అందుబాటులోకి తేవడంలో హరీష్ రావు మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులు బుట్ట దాఖలయ్యాయని విమర్శించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన హైదరాబాద్ మహానగరం చుట్టూ అక్రమ లే అవుట్లు,అక్రమ కట్టడాలపై, ప్రభుత్వ ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలపాలన్నారు.గత రెండు దశబ్దాలుగా రియల్టర్ల చేతిలో  హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 3,000 చెరువులు ధ్వంసం అయ్యాయాని గుర్తు చేశారు.

ల్యాండ్ పూలింగ్ పేరిట ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుండి వేల ఎకరాల భూములను గుంజుకొని కేవలం వంద గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి పేదలకు పేదలను అన్యాయానికి గురిచేస్తుందని అన్నారు.ఫార్మా కంపెనీల కోసం ఆళ్లగడప,వెలిమినేడు లో ఇథనాల్ కంపెనీ కోసం వెలగటూరులో, అమరరాజా బ్యాటరీల కంపెనీ కోసం దివిటిపల్లి లో పేదల అసైండ్ భూములను బలవంతంగా లాక్కొని ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు మాత్రం విలువైన భూములు కేటాయించి,రాయితీలు కల్పిస్తున్నారని అన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు, థర్డ్ క్లాస్ అని చేసిన వాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, దళితులకు క్షమాపణలు చెప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల మీద దాడులు, పత్రికలు, టీవీల మీద నిషేధం విధించడాన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు బీఎస్పీలో చేరేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్థానంలో పోటీ చేస్తుందని ప్రకటించారు. రెండు వేల రూపాయల నోట్ల రద్దుపై స్పందించిన ఆయన నోట్ల రద్దుతో కేవలం అక్రమంగా సంపాదించిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలకే భయమని పేద ప్రజలకు ఒరిగేదిమి లేదని అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తె బెల్టు షాపులు పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఎలక్షన్ గా వ్యవహరిస్తూ రైతులను తీరని అన్యాయానికి గురిచేస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking