Take a fresh look at your lifestyle.

బీఆర్ ఎస్ కు బిగ్ షాక్.. కవిత అరెస్టుకు రంగం సిద్ధం..?

0 21

బీఆర్ ఎస్ కు బిగ్ షాక్

లోక్ సభ ఎన్నికల వేళ కవిత ఇంట్లో సాదాలు..

కోర్టు అనుమతితో కవిత అరెస్టుకు రంగం సిద్ధం..?

పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒకరోజు ముందు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జేడీ ఆధ్వర్యంలో పది మంది అధికారుల బృందాలు బంజరాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు జరుపుతున్నాయి. కవితకు గత నెలలో కేంద్ర దర్యాప్తు సంస్థలైనా ఈడీ, సీబీఐ తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపాయి. మహిళను ఈడీ ఆఫీస్ కు పిలువద్దని, ఇంట్లోనే విచారించాలని సుప్రీం కోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేయగా విచారణ లో ఉంది. దీంతో ఆమె ఈడీ నోటీసుకు హాజరు కాలేదు. గత నెల 26న సీబీఐ సైతం తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. దీనికి కూడా ఇదే కారణంతో కవిత హాజరు కాలేదు.

కవిత అరెస్టు తప్పదా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ అధికారులు కోర్టు నుంచి అరెస్టు అనుమతి తీసుకుని కవిత ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొదట్లో కవిత సాక్షిగా ఉండేది. ఇటీవల ఆమెను నిందితురాలిగా చేర్చారు. ఈ కేసులో నిందితులందరిని అరెస్టు చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, రామచంద్రన్ పిళ్లై, బోయిన్ పల్లి అభిషేక్ లను అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసిన సమయంలో కవిత అరెస్టు అవుతుందని అందరూ భావించారు. అయితే.. ప్రస్తుతం కవిత నిందితురాలుగా చేర్చినందున అరెస్టు తప్పక పోవచ్చని తెలుస్తోంది.

వ్యూహాత్మకమేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ బీజేపీ  వ్యహాత్మకంగా చేయిస్తోందని తెలుస్తోంది. గతంలోనే ఆమె అరెస్టు కావాల్సి ఉండగా అలా జరుగలేదు. దీంతో బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటేననే ప్రచారం జరింగింది. ఈ ప్రచారంతో బీజేపీ రాజకీయంగా బాగా నష్ట పోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ కు పోటీ ఇచ్చే పరిస్థితులలో ఉండగా, అనుహ్యంగా మూడో స్థానానికి పడి పోయింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీజేపీ – బీఆర్ ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులు ప్రకటించిన చోట బీఆర్ ఎస్ ప్రకటించలేదన్నారు. ప్రస్తుతం లిక్కర్ కేసులో దర్యాప్తు వేగం పెంచితే బీజేపీ – బీఆర్ ఎస్ ఒక్కటి కాదని చాటి చెప్పినట్లు అవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ రోజు రోజుకు బలహీన పడుతుంది. నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లినంత మాత్రన ప్రజలు ఆ పార్టీలోకి వెళ్లలేరు. వీరిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీకి రాష్ట్రంలో అనుకూల పరిస్థితి ఉంది. దీంతో మరింతా బలోపేతం చేసుకునే పనిలో ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking