Take a fresh look at your lifestyle.

భూపాల్ పల్లి ఎస్ఐ రామకృష్ణ అత్యుత్సాహం

0 261

పోలీస్.. నిజాయితీగా విధులు నిర్వహించే పోలీసు ఆఫీసర్ లను గుండెలో పెట్టుకుని చూసుకుంటారు ప్రజలు. కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా ముందుకు వెల్లేది పోలీసు స్టేషన్ కే..

కానీ.. కొందరు ఖాకీ డ్రెస్ వేసుకుంటే నాకు ఎదురే లేదనుకునే పోలీసు ఆఫీసర్ లు ఉంటారు. చట్టం తమకు చుట్టం అనే ఫీలింగ్ తో డ్యూటీలు చేస్తూ ప్రజలను అనవసరంగా హింసిస్టుంటారు.

ఇగో..  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ద్విచక్ర వాహనదారులతో భూపాల్ పల్లి ఎస్ఐ రామకృష్ణ అత్యుత్సాహం చూపారు.

బైకర్‌ను కొట్టిన ఎస్ఐ రామకృష్ణ..

సారీ చెప్పించి కేసు పెట్టించిన భూపాలపల్లి మాజీ కలెక్టర్

ద్విచక్ర వాహనంపై రాంగ్‌రూట్‌లో వచ్చిన యువకుడిని లాఠీతో కొట్టిన ఎస్ఐపై మాజీ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్ఐతో యువకుడికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా కేసు కూడా నమోదు చేయించారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో జరిగిందీ ఘటన.

కూనారపు భిక్షపతి అనే యువకుడు రాంగ్‌రూట్‌లో బైక్‌పై వస్తుండడాన్ని గమనించిన స్థానిక ఎస్ఐ రామకృష్ణ అతడిని ఆపి లాఠీతో కొట్టారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి తన వాహనాన్ని ఆపి ఎస్ఐ వద్దకు వెళ్లి ఎందుకు కొట్టారని ప్రశ్నించారు.

అసలు కొట్టే హక్కు మీకెక్కడిదని నిలదీశారు. ఆయనతో యువకుడికి క్షమాపణ చెప్పించారు. భిక్షపతికి క్షమాపణ చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే, మురళీ మాత్రం ఆ విషయాన్ని అక్కడితో విడిచిపెట్టలేదు. భిక్షపతితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆయనపై ఫిర్యాదు చేయించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking