Take a fresh look at your lifestyle.

బలగం మూవీ మొగిలయ్యకు నిమ్స్ లో చికిత్స

0 101

బలగం మూవీ మొగిలయ్యకు నిమ్స్ లో చికిత్స

హైదరాబాద్, ఏప్రిల్ 12, (వైడ్ న్యూస్)  మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో బలగం మొగిలయ్యకు నిమ్స్ లో  చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆర్థికంగా వెనుక బడిన మొగిలయ్య వైద్యం చేయించుకునే పరిస్థితులు లేవు. అయితే.. ఆనారోగ్యంతో సీరియస్ గా ఉన్నాడని సమాచారంతో మొగిలయ్యకు మంత్రి హరీష్ రావు ఆదేశాలతో నిత్య పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు నిమ్స్ వైద్యులు.

దీర్ఘకాలంగా డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటన్నారు. మొగిలయ్య ఛాతి నొప్పి రావడంతో వరంగల్ నుంచి నిమ్స్ కు తరలించిన వైద్యాధికారులు అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండె సమస్య లేదని నిర్ధారించారు నిమ్స్ వైద్యలు.  డయాలసిస్ కొనసాగిస్తూ, చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని వెళ్లడించిన నిమ్స్ వైద్యులు

Leave A Reply

Your email address will not be published.

Breaking