Take a fresh look at your lifestyle.

జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేసిన ఏపి హైకోర్ట్

0 138

పాలకులు తప్పలు చేస్తే కోర్టులు మొట్టి కాయలు వేస్తునే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుక వచ్చారు. ఈ జీవో వల్ల రాష్ట్రంలో ధర్నాలు.. ర్యాలీలు.. రోడ్ షోలు తీయకుండా ఈ జీవో తో ప్రతి పక్షల గొంతు నొక్కడమేనని భావించారు.

జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడకుండా అడ్డుకుంటున్నారని కోర్టును ఆశ్రయించారు కొందరు.

జనవరి 23 వరకు జీవో నెంబర్ -1ను సస్పెండ్ చేసిన ఏపి హైకోర్ట్…

ర్యాలీలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ… ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు జనవరి 23 వరకు సస్పెండ్ చేసింది.

తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ జీవో నెంబర్-1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్ట్…

Leave A Reply

Your email address will not be published.

Breaking