Take a fresh look at your lifestyle.

అమిత్ షా మాటలు రెండు మతాల మధ్య చిచ్చు : బిఎస్పీ

0 14

తెలంగాణ భరోసా సభ పోస్టర్ ఆవిష్కరణ

అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 24 : అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. దేశాన్ని రక్షించాల్సిన హోం మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల తొలగింపు ప్రకటనను బిఎస్పి ఖండిస్తున్నదని తెలిపారు. అవసరమైతే వారి రిజర్వేషన్లు పెంచాలన్నారు ఆయన. వెంటనే అమిత్ షా తన వ్యాఖ్యాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మే 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే భరోసా బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

1994 తెలంగాణకు చెందిన జి.కృష్ణయ్య బీహార్ లో హత్యకు గురికాగ ఆనంద్ మోహన్ అనే దోషిని జైలుకు పంపారు. అయితే నితీష్ కుమార్ ప్రభుత్వం నిబంధనలు మార్చి ఆ దోషిని బయటకు తీసుకొచ్చే కుట్ర చేస్తుందన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. నితీష్ కుమార్ నిజంగా పేదల సి ఎం అయితే, ప్రజల ఓట్లతో గెలిచినవారైతే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాయవతి ఈ చర్యను ఖండించారని గుర్తుచేశారు. సిఎం కెసిఆర్ నితీష్ కుమార్ కు లేఖ రాయాలని ఈ చర్యను ఖండించాలని డిమాండ్ చేశారు. కరడు గట్టిన నేరస్థులను జైలు నుండి విడుదల కాకుండా ఉండే చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆ చట్టాలను మార్చే అధికారం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking