Take a fresh look at your lifestyle.

 షార్జాలో WTITCకు స్థలం కేటాయింపు

0 69

యూఏఈ లో విస్తరణ దిశగా WTITC అడుగులు
షార్జా రాజకుమార్తె ఇచ్చిన విందులో సందీప్ మఖ్తల బృందం
 షార్జాలో WTITCకు స్థలం కేటాయింపు

దుబాయ్,  తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ సంస్థల విస్తరణ అవకాశాల కోసం ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) తలపెట్టిన యూఏఈ పర్యటన ఆదివారం ముగిసింది. సందీప్ కుమార్ మఖ్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే ఎన్నో చర్చలు మరియు ఒప్పందాలు జరిగాయి.

షార్జా రాజకుమార్తే ఆహ్వానం మేరకు ఆమె ఇచ్చిన రమదాన్ మజిలిస్ విందులో WTITC బృందం పాల్గొని అనేక విషయాలపై చర్చలు జరిపింది. తెలుగు కంపెనీల బాగసామ్యం మరియు విస్తరణ కొరకు WTITCకు స్థలం కేటాయిస్తున్నట్టు షార్జా ఎఫ్డీఐ ప్రకటించింది. సోమవారం ఒమన్ లో పర్యటించనుంది WTITC బృందం.

 గల222

యూఏఈ పర్యటనలో భాగంగా తొలుత
షార్జా రాజకుటుంబీకులు FDI ఆఫీస్ సీఈవో అయిన మహమ్మద్ జుమ్మా అల్ ముసారక్ ను కలుసుకొని కీలక చర్చలు జరిపారు. షార్జాలలో తమ సంస్థ పూర్తిగా వ్యాపార అవకాశాలను పెంపొందించుకునేందుకుగాను సిద్ధంగా ఉందని, అందుకు దుబాయ్, షార్జా, అబూ దాబి చక్కని వేదిక అవుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటి రంగంలో తెలుగు నిపుణులు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ WTITC అని, తమ ఆలోచన విధానాలను రాజకుటుంబీకులతో పంచుకున్నారు. దీనిపై స్పందించిన రాజకుటుంబీకులు.. FDI ఆఫీసులో WTITC సంస్థకు స్థలమిచ్చేందుకు అంగీకరించారు. దీనిపై సందీప్ కుమార్ మఖ్తల ధన్యవాదాలు తెలిపారు.

షార్జా రాజ కుమార్తె షికా బోడోర్ బింట్ సుల్తాన్ అల్ ఖాసిమి ఏర్పాటుచేసిన రమాదాన్ మజిలీస్ కార్యక్రమంలో సందీప్ కుమార్ మఖ్తల పాల్గొన్నారు. ఐటీ రంగ విస్తరణ పై WTITC సంస్థకు తగినన్ని అవకాశాలు కల్పిస్తామని వారు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మఖ్తల మాట్లాడుతూ యూఏఈ లో తమ సంస్థ విస్తరణ పై రాజ కుటుంబీకులతో జరిగిన చర్చలు ఎంతో ఫలప్రధంగా జరిగాయని… తమ సంస్థకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారని అన్నారు.

ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. దుబాయ్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం… ఒమన్ దేశంలోనూ WTITC విస్తరణ కోసం పర్యటనకు సందీప్ కుమార్ మఖ్తల సోమవారం బయలుదేరనున్నారు. యూఏఈ పర్యటనలో సభ్యులు నాగభూషణరావు గుప్తా మద్దుల, అఖిలేష్ కుమార్ కాండ్రె, SRR క్లౌడ్ సంస్థ సీఈవో శశిధర శర్మ, చైతన్య శర్మ యాడాటి, మణి కిషోర్ గోలి, ఇతర సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking