Take a fresh look at your lifestyle.

అల్లెం నవీన్ లైఫ్ యువతకు ఆధర్శం.. ఇరువై ఏళ్లకే ‘‘పుడ్ వాహన్’’ బిజినెస్

0 21

ఇరువై ఏళ్లకే ‘‘పుడ్ వాహన్’’ బిజినెస్

నవీన్ బిజినెస్ పై కారోనా దెబ్బ..

వెబ్ డిజైనర్ గా స్వయం ఉపాధితో..

నిర్దేశం, నిజామాబాద్ : ఉపాయం ఉన్నోడు ఉపవాసం ఉండడంటారు పెద్దలు. ఇగో.. అల్లెం నవీన్ కూడా ఉపాయంతో ఆలోచించి తనకు తానే ఉపాధి చూసుకున్నాడు. కరోనా వచ్చి అల్లకల్లోలం చేసి ఉండక పోతే ఈ నవీన్ పెద్ద బిజినెస్ మెన్ గా మారుతుండే. చదివిన చదువుకు సార్థకతా చేస్తూ క్రియేటివ్ గా థింక్ చేసిన నవీన్ లైఫ్ లోకి తొంగి చూస్తే భలేగా ఉంటుంది.

నవీన్ జీవిత ప్రస్థానం..

అల్లెం నవీన్ ది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం. తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలు.. తండ్రి నర్సయ్య కొద్దిపాటి భూమిలో వ్యవసాయం సాగు చేస్తుంటాడు. మధ్య తరగతి కుటుంబమైనా తన కుమారుడు నవీన్ ను చదివించాలని ఆలోచించారు తల్లిదండ్రులు. అతను ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి కాగానే కంప్యూటర్ నేర్చుకోవడానికి ఆర్మూర్ పంపించారు పేరేంట్స్.. అంతే.. కలలు కను నిజం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు ఆ కంప్యూటర్ లో ప్రపంచాన్ని చూసిన నవీన్ వెబ్ డిజైనర్ గా కలలు కన్నాడు. ఇప్పుడు ఆ వెబ్ డిజైనర్ గా జీవితంలో స్థిర పడాలని నిర్ణయించుకున్నాడు.

హోటల్ బిజినెస్ లోకి అడుగులు..

నవీన్ చిన్నప్పటి నుంచి డిఫరెంట్ గా థింక్ చేస్తాడు. అంతే.. బికాం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగానే హైదరాబాద్ లోని అమీర్ పేట్, Pixxel Arts Institute లో వెబ్ డిజైనర్  నేర్చుకున్నాడు. ఐదు వేల రూపాయలు ఖర్చు చేసి వెబ్ డిజైన్.. యాప్ ను తయారు చేసి ఆర్మూ


ర్ ప్రాంతంలో ఆగష్ట 15, 2020లో స్వాతంత్య దినోత్సవం రోజున బిజినెస్ ప్రారంభించారు. స్విగ్గి, జుమాటో లేని ఆర్మూర్ ప్రాంతంలో ‘‘పుడ్ వాహన్’’ పేరుతో బిజినెస్ ప్రారంభించారు. అందుకోసం తన మితృడు నదీమ్ ను బిజినెస్ లో పాట్నర్ గా తీసుకున్నాడు.

పొల్యూషన్ లేని వాహణం..

వెరైటీగా థింక్ చేసిన వెబ్ డిజైనర్ నవీన్ FOOD VAHAN CHARGING BIKE BE FAIR DON’T POLLUTE THE AIR అని స్లోకాన్ తో బిజినెస్ చేసాడు. బిజినెస్ డెవలప్ కావాలంటే టీ – షర్ట్స్.. కరపత్రాలు పంపిణి చేశారు. ఈ బిజినెస్ ద్వారా మరో ముగ్గురికి ఉపాధి చూపాడు నవీన్. ఆర్డర్ ఇచ్చిన వెంటనే పుడ్ సప్లై చేసి ఆర్మూర్ ప్రాంతంలో ఐదు వేల మంది ప్రేమను సంపాదించి తన బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు నవీన్.

‘‘పుడ్ వాహన్’’ బిజినెస్ కరోనా దెబ్బ..

నవీన్ – నదీమ్ – ధనుంజయ్ ముగ్గురు కలిసి ‘‘పుడ్ వాహన్’’ బిజినెస్ ప్రారంభించారు. ఆ  సమయంలోనే ప్రపంచాన్ని వణికించిన కరోనా మహ్మరి హోటల్ బిజినెస్ పైన పడ్డది. అప్పటికే నాలుగు నెలలుగా బిజినెస్ చేసి నెలకు ముప్పై వేలకు పైగానే సంపాదించిన నవీన్ కరోనా కాలంలో బిజినెస్ ను ఆపేయాలని నిర్ణయించుకున్నాడు.

అంతే.. అప్పటికే ఆర్మూర్ ప్రాంతంలో అందరికి సుపరిచితం కావడంతో అమెజాన్ కొరియర్ సురేష్ కు ‘‘పుడ్ వాహన్’’ ను 90 వేలకు అమ్మేసిన నవీన్ హైదరాబాద్ లో UNISUN MARKETING SERVICES లో వెబ్ డిజైనర్ గా పని చేస్తున్నాడు అల్లెం నవీన్.

ఇరువై ఏళ్లకే స్వయం ఉపాధి వెతుక్కున్న నవీన్ కు థింకింగ్  గ్రేట్ కదూ.. ఇగో అతనిని అభినందించాలనుకుంటే సెల్ నెంబర్ 8143527275 ఇదే..

Leave A Reply

Your email address will not be published.

Breaking