Take a fresh look at your lifestyle.

అఖిల పక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం

0 283

నిరుద్యోగుల గోస అఖిల పక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం

: బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, మార్చి 21 : పేపర్ లీకేజి కేసు మూలాలన్ని కెసిఆర్ వద్ద ప్రగతి భవన్ లోనే ఉన్నాయి. కెసిఆర్,కెటిఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే ఈ లీకేజి జరిగిందని ఆరోపించారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

నీళ్లు నిధులు నియామకాలు… లీకులు, లిక్కర్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లుగా మారాయన్నారు ఆయన. పేపర్ లీకేజీ నిందితులందరికి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి నిరుద్యోగ అభ్యర్థులకు 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

తెలంగాణ నిరుద్యోగ యువత ఎలాంటి ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోవద్దని, బాగా చదవండి, మన రాజ్యం రాబోతుంది. మేమంతా మీ వెంట ఉంటామని హామీ ఇచ్చారు ఆయన. పేపర్ లీకేజీ , తెలంగాణ లోని అనేక అంశాలపై అఖిలపక్షాల భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

కేసిఆర్, కెటిఆర్ లకు దోపిడీ,దౌర్జన్యం మాత్రమే తెలుసని, ప్రజాస్వామ్యం,రాజ్యాంగం తెలియదన్నారు. ఎంతసేపు,ఫాహౌస్,హైటెక్ సిటీ,పబ్,క్లబ్ ల చుట్టూ ఉండడం కాదు, బయటకు వచ్చి దిల్ సుఖ్ నగర్,అశోక్ నగర్,ఓయూ లో ఉన్న నిరుద్యోగుల బాధలు చూడాలన్నారు ఆయన.

TSPSC చైర్మెన్ ఒకరే కావచ్చు.. కానీ బాధపడే 30 లక్షల మంది నిందితులు ఎంతటివారైనా వదలకూడదన్నారు ఆయన.

కవిత కేసు ప్రైవేట్ కేసు. దీనికి అడ్వకేట్ జనరల్ ఎందుకు డిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. కెసిఆర్ కు తన బిడ్డ మీద ఉన్న ఆరాటం… నిరుద్యోగ బిడ్డల మీద లేదన్నారు ఆయన.

నేను కూడా గురుకుల ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ డైరెక్టర్ గా పనిచేశాను .ప్రశ్నా పత్రాల భద్రత గురించి కొన్ని విధివిధానాలుంటాయి. చైర్మెన్ ఆధీనంలో ఉండే ఆఫీస్ లోనే ప్రశ్నాపత్రాలు భద్రపరుస్తారు. TSPSC 16 రూల్ ప్రకారం పేపర్ సెట్టింగ్, అప్రూవల్ చైర్మన్ దే బాధ్యత. కాన్ఫిడెన్షియల్ రూం కంప్యూటర్లకు ఇంటర్ నెట్,USB సౌకర్యం ఉండదు… మరి నిందితులకు పేపర్లు ఎలా లభించాయని ప్రశ్నించారు? ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

జనార్దన్ రెడ్డి ఈ సమస్యను చాలా చిన్నదిగా చూపడం వల్లనే నేను ఆమరణ నిరాహార దీక్ష చేశానని పేర్కొన్నారు ఆయన. తెలంగాణలో ప్రభుత్వం చేసే అనేక తప్పులను చాలా చిన్నవిగా చూపిస్తున్నాయి. ప్రభుత్వం I&PR ద్వారా అన్ని మీడియా సంస్థలను కంట్రోల్ చేస్తున్నాయి,ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా రాజకీయ నాయకులు,మీడియా సంస్థలపై నిఘా పెట్టిన ప్రభుత్వం,ఈ పేపర్ లీకేజీలో ఎందుకు అలాంటి టెక్నాలజీ వాడడం లేదని మండిపడ్డారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

సిఎం మీడియా సమావేశం పెట్టి జనార్దన్ రెడ్డి వెళ్లాలంటే వెళ్లరా? మరి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. *సిఎం తో పది సంవత్సరాల కాలం పాటు పనిచేసిన ఆఫీసర్ బంధువు మరియు ఒక బిఆర్ఎస్ నాయకుడు బోర్డు మెంబర్ ఎలా ఉంటారని అన్నారు. ఇంటర్ పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్లిన నిందితుడు బోర్డు మెంబర్ గా ఉన్నారని గుర్తు చేశారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

తెలంగాణ కోసం పోరాడిన వారు,రాజకీయ నిరుద్యోగులు కాదు.కెటిఆర్ అలా మాట్లాడడం సరైంది కాదన్నారు ఆయన. *నేను కూడా సిట్ అధికారిగా పని చేశాను. సిట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు…
నిజాయితీగా పనిచేసే వారిని సిట్ లో ఉండనివ్వరు. సిట్ ఆఫీసులో కనీసం కుర్చీలు కూడా ఉండవు అన్నారు ఆయన. మార్చి 11 లో కేసు నమోదైతే… 17 వరకు కంప్యూటర్లు ఎందుకు సీజ్ చేయలేదు.
అప్పటివరకు ఏం జరిగింది.? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking