Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ యువతకు న్యాయం కోసం అఖిల పక్షకమిటీ

0 53

లీకేజ్ ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం..

  • బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

నల్గొండ, ఏప్రిల్ 7 (వైడ్ న్యూస్) విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న పార్టీల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వ రేక విధానాలపై పోరాటం చేయడానికి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పేపర్ లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటైందన్నారు ఆయన. యూనివర్సిటీలో టీచర్లు లేరు.. పోటీ పరీక్షల పుస్తకాలు లేవు.. మంచి నీరు లేవు..  పైగా ఎవరిని యూనివర్సిటీలోపలికి రానివ్వడం లేదని విమర్శించారు ఆయన.

కేసీఆర్ యూనివర్సిటీలు మీ అయ్య సొత్తు కాదని ప్రశ్నించారు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ విద్యార్థుల పోరాటం లేకపోతే మీకు 300 ఎకరాల ఫాంహౌస్ వచ్చేదా..? నీ కుటుంబంలో అందరికీ మంత్రి పదవులు వచ్చేవా? అన్నారు ఆయన.

మంత్రి జగదీష్ రెడ్డి పేపర్ లీకేజీ కామన్ అన్నారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికింది అన్నారు. ఎవరు కోతులో ప్రజలే నిర్ణయిస్తారని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కమీషన్ చైర్మెన్, సభ్యులను తొలగించక పోతే ప్రజలు మిమ్మల్ని నమ్మరని పేర్కొన్నారు ఆయన.

ప్రశాంత్ అనే వ్యక్తి బిజెపి ఆధ్వర్యంలో నడిచే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ లో పనిచేస్తున్నారన్నారు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పదవ తరగతి విద్యార్థుల జీవితాలను ఆగం చేయాలని చూసిన బిజేపి ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు ఆయన. మరో ప్రక్క పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీలో ఎందుకు నెల రోజులుగా అసలైన దొంగలను దొరకబట్టడం లేదని ఆయన నిలదీశారు. లీకేజీకి కారణమైన చైర్మెన్ జనార్దన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు ఆయన. ఒక వ్యక్తి 100 కు డయల్ చేసే వరకు ఈ కుట్ర బయటకు రాలేదన్నారు ప్రవీణ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.

Breaking