Take a fresh look at your lifestyle.

జనాభాకు తగిన రిజర్వేషన్ల ను కల్పించాలి

0 92

ముదిరాజ్ ల లెక్కింపు తోనే అభివృద్ధి సాధ్యం
జనాభాకు తగిన రిజర్వేషన్ల ను కల్పించాలి
తక్షణం బీసీ బి సి డి నుంచి బీసీఏలోకి మార్చాలి ముదిరాజులు జాకుగా ఏర్పడడం శుభపరిణామం
మెపా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్

బీహార్ రాష్ట్రంలో కులగణన ప్రారంభించిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్యను లెక్కించాలని, దాని ద్వారానే ముదిరాజుల అభివృద్ధి సాధ్యమవుతుందని,  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గణనకు కార్యాచరణ ప్రకటించాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

శనివారం మెపా జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా అద్యక్షులు నీల అరుణ్ కుమార్ ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యే జాతి అభివృద్ధి కి ప్రధానం అని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలు పని చేస్తున్నాయని,రాష్ట్రం లో ఉన్న అన్ని జిల్లా కమిటీ లలో  మొట్ట మొదటి మెపా జిల్లా కార్యాలయం జనగామలో  ఏర్పాటు చేయడం సంతోషకరం అని కమిటీ సభ్యులను కొనియాడారు.

ఈనెల 27వ తేదీన హైదరాబాదులో ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించడం శుభ పరిణామమని, రాబోయే రోజుల్లో అన్ని ముదిరాజ్ సంఘాలకు కలిపి ముదిరాజుల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని ప్రకటించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులను బీసి డి జాబితా నుంచి బిసి ఏ జాబితాలోకి మార్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 లక్షల ముదిరాజ్ జనాభా ఉందని, దానికి తగినట్లుగా 17% రిజర్వేషన్లు అమలు చేయాలని,అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో లో చేర్చాలని డిమాండ్ చేశారు.

.ఈ కార్యక్రమంలో మెపా జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు నీల అరుణ్ కుమార్ ముదిరాజ్, రెడ్డ బోయిన రాజు,రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుముల రామ్మోహన్,తిరుపతి నర్షిములు,చికుముల ఆంజనేయులు,ఎల్ల స్వామి,కుమార స్వామి, చందర్,బూసని.భాస్కర్,నీల విజయ్ కుమార్,పిట్టల కరుణాకర్,కుమార్,దండ బోయిన కుమార్, యకయ్యా,శివాజీ,ఆంజనేయులు,గుడిసె చందు,చిక్కుడు సాయి కుమార్  ముదిరాజ్ లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking