Take a fresh look at your lifestyle.

ఆర్టికల్ 311 ప్రకారం టీఎస్ పీఎస్సీ ఉద్యోగులపై చర్యలేవి..?

0 16

టీఎస్ పీఎస్సీ లీకేజీ కేసు – 02

ఆర్టికల్ 311 ప్రకారం

టీఎస్ పీఎస్సీ ఉద్యోగులపై చర్యలేవి..?

– ఈడీ అధికారులు, సిట్ అధికారుల నివేదికలపై చర్యలు శూన్యం

– పీడీ యాక్ట్ పెట్టక పోవడానికి కారణం..?

– రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..?

వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడున్నా.. మంచి భోజనం దొరుకుతుందనేది సామెత.. కానీ.. టీఎస్ పీఎస్సీ లో కూడా అదే సీన్ జరిగింది. పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్న టీఎస్ పీఎస్సీ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే  ఆరోపణలున్నాయి.

టీఎస్ పీఎస్సీ.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం పరీక్షలు నిర్వహించి ప్రతిభ గల అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ.. ఆ పరీక్ష పేపరులను భద్రంగా దాచి ఉంచాల్సిన టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు శంకరలక్ష్మీ, సత్యనారాయణలపై పేపర్ లీకేజీ సంఘటనలకు సంబంధించి  కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు తీసుకేలేదనేది ప్రశ్న. ముఖ్యంగా పేపర్ లీకేజీలో శంకరలక్ష్మీ వద్ద ఉన్న సీక్రెట్ పాస్ట్ వర్డ్ ‘సీవీఆర్’ వెనుక రహస్యం ఏమిటో కూడా విచారణ అధికారులు వాకబు చేశారు.

టీఎస్పీఎస్సీ

శంకరలక్ష్మీని విచారించిన ఈడీ అధికారులు

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలకమైన ఉద్యోగి శంకరలక్ష్మీ. ఆమె నిర్లక్ష్యంతో పేపరల్ లీకేజీలు జరిగాయా..? లేక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు పేపర్ లు బయటకు వచ్చాయా అనే విషయమై ఆమెను ఈడీ అధికారులు విచారించారు. అలాగే సిట్ అధికారులు కూడా శంకరలక్ష్మీని విచారణ చేశారు. అలాగే అంతర్గతంగా శాఖపరంగా విచారణ జరిపించారు. వీళ్ల విచారణలో తేలిన నిజాల ద్వారా ఉద్యోగులైన శంకరలక్ష్మీ, సత్యనారాయణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ప్రశ్న.

రాజ్యాంగంలోని 311 ఆర్టికల్ ప్రకారం..

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగులను రక్షిస్తోంది. అలాగే తప్పు చేసిన వారిని శిక్షించేది కూడా ఇదే ఆర్టికల్.  పేపర్ లీకేజీ కేసులో టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు ప్రవీణ్, శ్రీనివాస్, షేమీమ్ లను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అలాగే పరీక్ష పేపర్ లను భద్రంగా ఉంచాల్సిన అధికారులు శంకరలక్ష్మీ, సత్యనారాయణలను విచారణ చేసిన అధికారుల నివేదిక ఆదారంగా ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేసిందనేది సర్వత్రా వినిపిస్తున్న సందేహాలు. ఉద్దేశ్య పూర్వకంగానే శంకరలక్ష్మీ, సత్యనారాయణలను పేపర్ లీకేజీ కేసులో నుంచి తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పీడీ యాక్ట్ పెట్టక పోవడానికి కారణం..?

నిజానికి టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల పేపరులు వేరు వేరుగా లీకేజీలు అయ్యాయి. ఒక్కొ పేపర్ లీకేజీపై బాధ్యులపై ఒక్కొక్క కేసు పెట్టాల్సి ఉంటుంది. నిందితులపై ఎక్కువ కేసులు పెట్టి ఉంటే పీడీ యాక్ట్ పెట్టడానికి అవకాశం ఉండేది. కానీ.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు పేపర్ లీకేజీ కేసులో వేరు వేరుగా కేసులు పెట్టక పోవడంతో నిందితులకు సులువుగా బెయిల్ దొరికింది. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఆ నిందితులపై వేరు వేరుగా కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టాలని బీఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అప్పట్లో డిమాండ్ చేశారు. కానీ.. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతెగాకుండా నిందితులకు కోర్టులో శిక్షలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండేది.

రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..?

కేసీఆర్ ప్రభుత్వంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరంలో ఉద్యోగులను రక్షించిందని కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీలతో పాటు నిరుద్యోగులు ఆరోపణలు చేశారు. పేపర్ లీకేజీ సంఘటనలకు సంబంధించి టీఎస్ పీఎస్సీ కాన్ఫిడెన్సియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ, సత్యనారాయణల నిర్లక్షమా.. లేక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా అనే విషయాలపై సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈడీ అధికారులు, సిట్ అధికారుల, శాఖపరమైన విచారణ ఆదరంగా శంకరలక్ష్మీ, సత్యనారాయణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు టీఎస్ పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి  పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

మల్లేష్ యాటకర్ల

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking