Take a fresh look at your lifestyle.

అమ్మ, నాన్నలకు సెల్యూట్ చేసిన పోలీసు అధికారి

0 19

అమ్మ, నాన్నలకు సెల్యూట్ చేసిన పోలీసు అధికారి

  • డిఎస్ పి ప్రమోషన్ ను ఆ పేరేంట్స్ కు అంకితం

అమ్మ అంటే ప్రేమ.. నాన్న అంటే ఓ నమ్మకం.. పిల్లల ఎదుగుదల వెనుక వాళ్లిద్దరి కష్టం ఎంతో ఉంటుంది. ఆకలితో అలమటించి తన పిల్లల కడుపు నింపేవారే తల్లిదండ్రులు. ఎదుగడానిక కారణమైన ఆ తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ రుణ పడి ఉండాల్సిందే..

నిర్దేశం, నిజామాబాద్ :

డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా ప్రమోషన్ వచ్చిన సంతోషంతో తల్లిదండ్రులకు సెల్యూట్ చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ పోలీసు అధికారి. అతనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం రాజారాం నగర్ కు చెందిన ఎం. గంగాధర్. ఇరువై అయిదేళ్ల క్రితం సబ్ ఇన్ స్పెక్టర్ గా పోలీసు వృత్తిలోకి ప్రవేశించిన అతను అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్ స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చిన తరువాత హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాలలో విధులు నిర్వహించారు. ఇటీవల డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా ప్రమోషన్ వచ్చిన గంగాధర్ బిజీ వల్ల తన తల్లిదండ్రులను కలువలేక పోయారు. ఆదివారం ఆర్మూర్ వెళ్లిన అతను తన తల్లిదండ్రులకు గౌరవంగా సెల్యూట్ చేసి తన ప్రేమను చాటుకున్నారు. అరుదైన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking