Take a fresh look at your lifestyle.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం ఉదృతం

0 17

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం ఉదృతం

:  ఎంపి ఆర్. కృష్ణయ్య పిలుపు

హైదరాబాద్ జూన్ 10
రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి సంఘాల అఖిల పక్ష సమావేశం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామ కృష్ణ అధ్యక్షతన ఓయు జేఏసి ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి, బిఎస్ఎఫ్ విద్యార్ధి సంఘం నాయకులు వెలుపల సంజయ్, అమ్మ్ ఆద్మీ పార్టీ విద్యార్ధి విభాగం అద్యక్షులు పరీక్షన్ రాజు, బిఎస్పి,పార్టీ విద్యార్ధి సంఘం నాయకులు సంజయ్, ఎంఎస్ఎఫ్, విద్యార్ధి సంఘం నాయకులు శాంతి కుమార్, బిసి యువజన విద్యార్ధి సంఘం నాయకులు శాంకు యాదవ్, SC/ST/BC/మైనారిటీ విద్యార్ధి సంఘం నాయకులు మహేశ్, ఎన్టివిఎస్ విద్యార్ధి సంఘం నాయకులు తిరుపతి, జూనియర్ అడ్వకేట్ సంఘం నాయకులు వంశీ కృష్ణ, ఎంఎస్ఎఫ్,, బిఎస్ఎఫ్,,విజేఎస్, డిఎంఎస్ఏ, టిఎన్ఎన్విఎస్, వివిఎస్, నిరుద్యోగుల జేఏసిమరియు వివిధ విద్యార్ధి సంఘం నాయకులు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.

ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివితే బి.సి. విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని, అలాగే ఐఐ.టి, ఐ.ఐ.ఎం ఎన్.ఐ.టి తదితర కోర్సులకు కూడా పూర్తి ఫీజులు చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని, ఈ సంవత్సరంలో అదనంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కు గురుకుల పాటశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాలలో ధరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్ధికి ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా విద్యను అందించాలని, ధరఖాస్తు చేసుకొన్న ప్రతి విద్యార్థికి విదేశీ విద్యా నిధులు మంజూరు చేయాలని,రాష్ట్రంలో కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి,

వాటికి భవనాలు నిర్మించాలని, పాత కలెక్టర్ భవనాలను కాలేజీ హాస్టల్ లకు కేటాయించాలని, బి.సి స్టడీ సర్కిల్ కు రూ.200 కోట్లు కేటాయించాలని, కోచింగ్ పద్ధతులు మార్చాలని,v అర్హులందరికీ DSC, పోలీస్, SI, గ్రూప్-1,2,3,4 సివిల్స్, బ్యాంకింగ్, రైల్వే ఇతర పోటీ పరిక్షలకు కోచింగ్ ఇవ్వాలని, జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్టై ఫండ్ నెలకు రూ.1000 నుంచి 10 వేలకు పెంచాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వేముల రామ కృష్ణ, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, తెలంగాణ జేఏసీ చైర్మన్ కొలా జనార్దన్, విద్యార్థి సంఘం నేత అనంతయ్య,అడ్వ కేట్ జేఏసీ ప్రతినిధి వంశీ కృష్ణ, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking