Take a fresh look at your lifestyle.

తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి ఎంతో కృషి : కేంద్ర మంత్రి

0 14

తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి ఎంతో కృషి

: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్, మే 20 : భౌగోళికంగా ఎంతో కీలకమైన పాలమూరు జిల్లాకు ఇతర ప్రాంతాలతో కనెక్టివిటి పెరగడం ఎంతో ముఖ్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందుకే ప్రధాని మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడి మహబూబ్ నగర్ లో మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో … మహబూబ్ నగర్ వరకు పొడిగించిన కాచిగూడ -విశాఖ ఎక్స్ ప్రెస్ ను కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.  అభివృద్ధి జరగాలంటే కనెక్టివిటీ ఎంతో ముఖ్యమన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ వెయ్యి కిలోమీటర్ల రైల్వే లైన్ల అభివృద్ధి కోసం భూసేకరణ చేయాలని.. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కోరారు.

మహబూబ్ నగర్ జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో రైల్వే, రోడ్ల అభివృద్ధి ఎంతో అవసరమన్నారు. అందుకే కేంద్రం ఈ జిల్లాలో జాతీయ రహదారులను సైతం అభివృద్ధి చేస్తోందన్నారు. అలాగే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయడంతో పాటు.. ముఖ్యమైన రైళ్లు ఆగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కాచిగూడ-విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్ రైలును.. మహబూబ్‌నగర్ వరకు పొడగించడం.. ఈ రైలును ఇవాళ ప్రారంభించుకుంటున్న సందర్భంగా మహబూబ్‌నగర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు కిషన్ రెడ్డి.

” ఈ రైలు మార్గం పొడగింపు ద్వారా.. మీకు.. ఇక్కడినుంచి హైదరాబాద్ వెళ్లి.. అక్కడ విశాఖ పట్టణానికి రైలు ఎక్కాల్సిన శ్రమ ఉండదు.  భౌగోళికంగా కూడా పాలమూరు చాలా కీలమైంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు కర్ణాటకలతో అనుసంధానమయ్యే ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెరగడం మరీ ముఖ్యంగా రైల్వేల విషయంలో అనుసంధానత పెరగడం మంచి పరిణామం. దీన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పాలమూరు ప్రాంతంలో రైల్వే లైన్ల డబ్లింగ్ కావొచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావొచ్చు. ఇలా రైల్ రూట్ల పొడగింపు కావొచ్చు. ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాప్ విషయంలో కావొచ్చు.. చాలా సానుకూలంగా స్పందిస్తోంది. ఇందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

వారం రోజుల క్రితమే రైల్వేశాఖ మంత్రి గారిని కలిశాను. ఈ సందర్భంగా యశ్వంత్ పూర్ – హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి కర్నూలు చేరుకునే వరకు 200 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా స్టాప్ లేని విషయాన్ని గుర్తుచేస్తూ.. మధ్యలో ఉన్న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్లో ఈ రైలుకు స్టాప్ ఏర్పాటుచేయాలని కోరాను. తద్వారా ఢిల్లీ, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి రైలు ఎక్కాల్సిన అవసరం ఉండదని చెప్పాను.

దీనికి కూడా అశ్వినీ వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా చెంగల్ పట్టు – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ను కూడా షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఏర్పాటు చేయాలని కోరగా.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు” అని కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking