నడుస్తున్నకారులో మంటలు
నిర్దేశం, హైదరాబాద్ :
హైదరాబాద్‌లోని సైఫాబాద్ రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నంనడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ షాకింగ్ సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.కారు లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా అందులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారును రోడ్డు పక్కన ఆపుజేశాడు. దీంతో అందులో ఉన్న వారంతా వెంటనే దిగిపోయారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే కారులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో పాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో లక్డీకపూర్ పరిసరప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ పంపును మూసి వేశారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.దీంతో సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చి పోలీసులు మంటలను అదుపు చేశారు.