Take a fresh look at your lifestyle.

బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదు

0 444

రాజకీయం అంటె ఇంతే..

పాత కేసులు తిరుగతోడి కక్ష తీసుకుంటారు.

మరిచి పోయిన సంఘటనలను పున: ప్రారంభించి పోలీసు కేసులతో బ్లాక్ మెయిల్ చేస్తారు.

మరి.. ఎప్పుడో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు రావడం.. వారు కేసు నమోదు చేయడం రాజకీయాలో చర్చ ప్రారంభమైంది.

ఇంతకు ఈ కేసు వెనుక రాజకీయ వ్యూహం ఉందో లేదో పోలీసులు విచారణపై రుజువు చేస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కొడుకు సాయ భగీరత్ దాడి చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదు

బండి సంజయ్ కొడుకు తన బ్యాచ్ మేట్‌ను కొట్టినందుకు సాయి భగీరత్ పై మహీంద్రా యూనివర్సిటీ నుండి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

సాయి భగీరత్ పై IPC 341, 323, 504, 506 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

యూనివర్సిటీ హాస్టల్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్లు విశ్వవిద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

కాలేజీ ప్రాంగణంలోనే ఈ దాడి జరిగిందన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దుండిగల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పాత వీడియాతో రాజకీయమా..?

ప్రస్తుతం బండి భగీరథ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టారంటూ బాధిత విద్యార్థి శ్రీరామ్ చెబుతున్నాడు. తాను భగీరథ, నేను ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్‌ అని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ చెప్పడం గమనార్హం.

పోలీసులకు  అరెస్టు చేసే దమ్ముందా..?
సామాన్యుడిపై ఫిర్యాదు వస్తే వెంటనే అరెస్టు చేసే పోలీసులు బీజేపీ చీప్ బండి సంజయ్ కొడుకు సాయి భగీరత్ ను అరెస్టు చేసే దమ్ముందా  అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking