Take a fresh look at your lifestyle.

24వ సీఈసీ యూజీసీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్

0 13

24వ సీఈసీ యూజీసీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్

27 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్ వరకు

హైదరాబాద్, ఏప్రిల్ 27 : నూతన విద్యావిధానం లక్ష్యాలను అధిగమించేందుకు డిజిటల్ విద్యావిధానం ఒక్కటే మార్గమని కన్షార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ అని అన్నారు డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా. 27శాతంగా ఉన్న విద్యార్థుల జాతీయ సగటు నమోదు నిష్పత్తిని 2035 నాటికి 50శాతానికి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. సంప్రదాయ విద్యావిధానం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోలేమన్న ప్రొఫెసర్ నడ్డా.

డిజిటల్ విద్యావిధానం ద్వారానే ఇది సాధ్యమని వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఠాగూర్ ఆడిటోరియంలో జరగనున్న – యూజీసీ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ప్రఖ్యాత తెలుగు డైరెక్టర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి శేఖర్ కమ్ముల ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.

యూజీసీ సీఈసీ నిర్వహించే 24వ విద్యా సంబంధ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చిన వీడియోల ప్రదర్శన, పురస్కారాల ప్రదానం రేపటి నుంచి 29వ తేదీ వరకు జరగనుందని సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమం ఠాగూర్ ఆడిటోరియంలో జరగనుండగా… 27 మధ్యాహ్నం నుంచి 29వ తేదీ వరకు డాక్యుమెంటరీల ప్రదర్శన ఓయూ దూరవిద్యాకేంద్రం ఆడిటోరియంలో జరగనుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.

విద్యార్థులు, ఇతర భాగస్వామ్యులలో అవగాహన పెంపొందించడం కోసం పురస్కారాలు గెలుచుకున్న, సైటేషన్‌కు ఎంపికైన చిత్రాలు మూడు రోజుల పాటు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. నిష్ణాతులైన బృందం ఆధ్వర్యంలో ఎంతో కఠినతరమైన వడపోతల అనంతరం ఈ చిత్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.. 12 విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు రూ. 25వేల నుంచి రూ. లక్ష వరకు నగదు బహుమతి, సర్టిఫికేట్, ట్రోఫీ అందించడం జరుగుతుందని వెల్లడించారు.

సైటేషన్‌కు ఎంపికైన చిత్రాలకు సర్టిఫికేట్ అందించనున్నట్లు చెప్పారు. నూతన విద్యా విధానం – 2020 అవసరాల మేరకు సీఈసీకి తమ వద్ద ఉన్న విద్యా సామాగ్రి మొత్తాన్ని హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠీ, తమిళ్‌, తెలుగు, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా 12 ప్రాంతీయ భాషల్లోకి అనువదించే బాధ్యతనూ కేంద్రం సీఈసీకి అప్పగించిందని వివరించారు. మాతృభాష అభియాన్ కింద ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

సీఈసీ – యూజీసీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ ఉస్మానియాలో నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జేబీ నడ్డాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియాలో పండుగ వాతావరణం నెలకొందన్న ఆయన…. ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించే సినిమాలను చూసేందుకు విద్యార్థులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వటం ఆనందంగా ఉందని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఈసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునిల్ మెహ్రూ, యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ టి. మృణాళిని, ప్రొఫెసర్ ప్యాట్రిక్, పి. రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking