Take a fresh look at your lifestyle.

16 మెడల్స్ ను పోలీస్ శాఖకు బహూకరించిన..

0 431

శారీర దారుధ్యానికి పోలీస్ అధికారులు క్రీడల్లో పాల్గొనాలి

-డీజీపీ అంజనీ కుమార్

తన16 మెడల్స్ ను పోలీస్ శాఖకు బహూకరించిన

రిటైర్డ్ పోలీస్ అధికారి ఖాసీం

హైదరాబాద్, మార్చి 16 :: పోలీస్ శాఖలో పనిచేసే యువ పోలీస్ అధికారులు తమ శరీర దారుఢ్యాన్ని కాపాడుకుంటూ క్రీడాపోటీల్లో పాల్గొని శాఖకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారి మహ్మద్ ఖాసీం తన సర్వీసులో సాధించిన పలు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ను పోలీస్ మ్యూజియంకు బహుకరించిన కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు

తెలంగాణ పోలీస్ అకాడమీ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీజీపీ ప్రసంగిస్తూ, పోలీస్ అధికారిగా పనిచేసిన ఖాసీం ఒక వైపు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు జాతీయ, అంతర్జాతీయ పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొని పలు మెడల్స్ సాధించడం గొప్ప విషయమని అన్నారు. ప్రస్తుత యూత్ పోలీస్ అధికారులకు ఖాసీం ఆదార్శప్రాయుడని పేర్కొన్నారు.

తన మెడల్స్ ను పోలీస్ శాఖ మ్యూజియంకు బహూకరించడంతో మ్యూజియం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. 1982 లో జరిగిన ఆసియా క్రీడలు, 1983 ప్రపంచ క్రికెట్ లతో దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మౌంటెనీరింగ్ లో నిష్ణాతులైన ఐజీ తరుణ్ జోషి త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించనున్నట్లు తెలిపారు. మారథాన్ రన్ లో పాల్గొనే డీఐజీ రమేష్ రెడ్డి తాను పాల్గొన్న జాతీయ అంతర్జాతీయ రేస్ ల గురించి తెలియచేసారు
తన16 మెడల్స్ ను బహుకరించిన ఖాసీం

పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి ) గా పనిచేసిన కాలంలో తనకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో వచ్చిన 16 మెడల్స్ ను పోలీస్ శాఖ మ్యూజియం కు మహమ్మద్ ఖాసీం నేడు బహూకరించారు.. సెప్టెంబర్, 2000 సంవత్సరంలో పదవీ విరమణ పొందిన మహమ్మద్ ఖాసీం మంచి అథ్లెట్ కూడా. తన సర్వీసులో అల్ ఇండియా పోలీస్ మీట్, అల్ ఇండియా ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్, అల్ ఇండియా పోలీస్ గేమ్స్, ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మీట్ లలో అథ్లెట్ గా పాల్గొన్న ఖాసీం కు 10 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్ వచ్చాయి.

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెడల్స్ ను తన వద్ద ఉంచుకోకుండా, యువ పోలీస్ అధికారులకు స్ఫూర్తి నిచ్చేందుకు గాను వాటిని పోలీస్ శాఖకు బహూకరించారు. ఈ మెడల్స్ అన్నింటిని తెలంగాణ పోలీస్ అకాడమీ లోని మ్యూజియంలో ప్రదర్శించడానికి నేడు పోలీస్ అకాడమీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్ కు అందచేసారు.

పోలీస్ అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీపీలు అభిలాష బిస్ట్, షికా గోయల్, ఎస్.కె.జైన్, ఐ.జి. కమలహాసన్ రెడ్డి, చంద్ర సజెకర్ రెడ్డి, తరుణ్ జోషి, డీఐజీ రమేష్ రెడ్డి, అకాడమీ ఇంచార్జ్ జాయింట్డైరక్టర్- డా. నవీన్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్లు- డా.జానకిషర్మిల, అనసూయ, శ్రీరామమూర్తి, రాఘవరావు, మరియు అసిస్టెంట్ డైరెక్టర్లు- రవీందర్ రెడ్డి, గంగారెడ్డి, కృష్ణమూర్తి,రమణ,భూపాల్, శ్రీమతి శ్రీదేవి మరియు DSsP లు హాజరైన ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖాసీం ను డీజీపీ అంజనీ కుమార్ ఘనంగా సన్మానించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking