Take a fresh look at your lifestyle.

కేటీఆర్ లో అధికారం పోయిందనే బాధతో..

0 7

కేటీఆర్ మాటల్లో అహంకారం
ఆబద్దాలను నిజాలుగా..

కేటీఆర్.. అధికారం పోయిందనే బాధ నుంచి ఇంకా తేరుకోలేడు. తొంటి ఇరిగి తండ్రి కేసీఆర్ ఎప్పటిలా బయటి ప్రపంచానికి అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంటే కేటీఆర్ స్పీచ్ లతో రెచ్చి పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు కాగానే తాము సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తామని చెబుతూ ప్రతి రోజు పొలిటికల్ అటాక్ చేస్తున్నారు. అతని స్పీచ్ లో అధికారం పోయిందనే బాధ మాత్రం సామాన్యుడికి అర్థమవుతుంది. కామారెడ్డి నియోజక వర్గంలో కేటీఆర్ సమక్షంలో కార్యకర్తలు గొడవ పడటం విశేషం.

ఆదివారం జరిగిన కామారెడ్డి నియోజక వర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాబసాగా మారింది. కేటీఆర్ వస్తున్న ఈ కార్యకర్తల సమావేశానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, కేసీఆర్ లా ఫోటోలు మాత్రం ఉన్నాయి. కామారెడ్డి నియోజక వర్గ ఇన్ చార్జీ, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఫోటో లేక పోవడంతో కేటీఆర్ సమక్షంలోనే కార్యకర్తలు గొడవ చేశారు. గంప జోక్యంతో ఆ గొడవ సద్దు మణిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఈ నియోజక వర్గంలో బీఆర్ ఎస్ లో అధిపత్య పోరు కొనసాగుతుంది. ఉద్దేశ్యపూర్వకంగానే గంప ఫోటో పెట్టకుండా అవమానించినట్లు తెలుస్తోంది.

కామారెడ్డి నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ రెచ్చి పోయారు. ‘‘నీవు మగాడివైతే..’’ అనే మాటను డజన్ కంటే ఎక్కువే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అతని మాటలకు తన చుట్టున్న క్యాడర్ చప్పట్లు కొడుతూ ప్రొత్సహించారు. కానీ.. కేటీఆర్ లైవ్ లో వింటున్న ప్రజలు మాత్రం విస్మయానికి గురయ్యారు. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది కేటీఆర్ స్పీచ్. అతని స్పీచ్ లో పచ్చి ఆబద్దాలను కార్యకర్తలకు చెప్పడానికి యత్నించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటార్వ్యూలో ‘జనాలు మోస పోవాలని చూస్తారు. మనం మోసం చేసి అధికారంలోకి రావాలి. అధికారం కోసం ఆబద్దాలు చెప్పినప్పుడు గెలుపు మనదైతాది. ప్రజలు గొర్రెల్లా మోసం చేసేటోళ్లను నమ్ముతారు. మనలను ఎందుకు నమ్ముతారు’ అంటూ కార్యకర్తలను ఖుషి చేయడానికి ప్రయత్నించారు. తాను కల్పితాలు చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్లు బీఆర్ఎస్ కార్యకర్తలను నమ్మించడానికి యత్నించారు.

కేసీఆర్ స్పీచ్ ను కాపీ కొట్టినట్లుగా కేటీఆర్ కథలు కథలుగా చెప్పడంతో దిట్ట. తప్పును కూడా ఒప్పు అంటూ నమ్మించడంతో తండ్రి కొడుకులను మించినోళ్లు మరొకరు లేరెమో.. గతంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినోళ్లను బీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు కేసీఆర్. ఒక పార్టీ నుంచి మరో పార్టిలో చేరినందుకు శ్రీనివాస్ యాదవ్ లాంటి లీడర్ కు మంత్రి పదవి కూడా ఇచ్చాడు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేస్తే పెండింగ్ లో పెట్టారు స్పీకర్.

కానీ.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ సమర్థించుకున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బంగారు తెలంగాణ కోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరితే తప్పేంటి అన్నారు. అగో.. కేసీఆర్ లానే కేటీఆర్ కూడా జనం గొర్రెల్లా కట్కొన్ని నమ్మి ఓటేచారని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎవరు తవ్వుకున్న బొందలో వాళ్లే పడుతారనేది నిజం. ఇప్పుడు కేసీఆర్ చూపిన బాటలోనే తన పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking