Take a fresh look at your lifestyle.

కుళ్లిన రాజకీయాలకు శస్త్ర చికిత్స చేసేదెవరో..?

0 14

కుళ్లిన రాజకీయాలకు శస్త్ర చికిత్స చేసేదెవరో..?
– నేతల్లో కరువైన నీతి, నిజాయితీ
– ఏ పార్టీ జెండాతో గెలిచినా అధికార పార్టీలోకే ఎమ్మెల్యేలు
– అపహాస్యమవుతున్న పార్టీ ఫిరాయింపుల చట్టం
– అన్నీ తెలిసినా స్పీకర్ మౌనమే..
– హైకోర్టు మెట్లెక్కినా లాభం లేదు
(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)
ఔను.. రాజకీయాలు కుళ్లి పోయాయి. అలా కుళ్లి పోవడానికి అందరూ బాధ్యులే.. రాజకీయ నాయకులలో నీతి లేదు.. నిజాయితీ లేదు.. నైతిక విలువలు అసలే లేవు. క్రిమినల్స్ కావచ్చు.. స్మగ్లర్ లు కావచ్చు.. గూండాలు కావచ్చు.. ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో చేరుతున్నారు. గతంలో బంగారు తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు పార్టీలో చేరతున్నారని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిసినం.. అందుకే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పేర్కొన్నారు.

టికెట్ ఇచ్చే ముందు..

పొలిటికల్ లో వింత పరిస్థితులుంటాయి. ఆయా పార్టీలు గెలుపు ధ్యేయంగా అభ్యర్థులకు టికెట్ ఇస్తారు. ఆ అభ్యర్థి గుణ గణాలతో అవసరం లేదు. ఓట్లను నోట్లతో కొనుగోలు చేసి ఎమ్మెల్యేగా గెలిస్తాడా.. లేదా అనేది ఆలోచిస్తారు. ఆ అభ్యర్థి క్రిమినల్ కావచ్చు.. గూండా కావచ్చు.. అతనిపై ఎన్ని కేసులైనా ఉండచ్చు.. కానీ.. ఫైనల్ గా గెలుపు ముఖ్యమనుకుంటారు. గెలిచిన ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరుతారు.

అధికారం వైపు …

ఒకప్పుడు పార్టీ సిద్ధంతాలతో పొలిటికల్ లీడరులు పని చేసేవారు. నైతిక విలువలతో బతికే వారు. కానీ.. ఇప్పుడు ఆ సిద్ధంతాలు లేవు.. నైతిక విలువలు, నీతి, నిజాయితీ అసలే లేదు. అందుకే ఏ పార్టీ జెండాతో గెలిచినా అధికార పార్టీలో చేరుతున్నారు. ప్రతి పక్షంలో ఉంటే నియోజక వర్గంను అభివృద్ది చేయలేమని కార్యకర్తల కోరిక మేరకే తాను అధికార పార్టీలో చేరుతున్నట్లు స్వయంగా గెలిచిన ఎమ్మెల్యే ప్రకటిస్తారు.

కళ్లుండి చూడలేని స్పీకర్

అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి పొలిటికల్ పార్టీ బీ ఫాం ఇస్తోంది. ఆ పార్టీ గుర్తు పైననే పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పార్టీ ఫిరాయిస్తే స్పీకర్ అతనిని అనర్హుడిగా ప్రకటించవచ్చు. కానీ.. ఆ స్పీకర్ అధికార పార్టీకి చెందిన నేత. అందుకే తమ పార్టీలోకి మారిన ఆ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందినా స్పీకర్ చర్యలు తీసుకున్న సందర్భాలు అరుదు. కేసీఆర్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేశారు. అయితే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్పీకర్ ను నిలదీయడం కూడా క్రమశిక్షణ రహిత్యమే. అందుకే ఏళ్లు గడిచినా ఆ ఎమ్మెల్యేపై స్పీకర్ అనర్హుడిగా వేటు వేయలేరు.

హైకోర్టుకు వెళ్లినా…

ఇటీవల బీఆర్ ఎస్ నుంచి ఖైరతబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే చేరారు. ఈ విషయమై స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు మెట్లు ఎక్కారు. దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించే విధంగా స్పీకర్ ను ఆదేశించాలని కోరారు. కానీ.. స్పీకర్ ను ఆదేశించే అధికారం తమకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

మహారాష్ట్ర స్పీకర్..

మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలను చీల్చిన ఏక్ నాథ్ షిండే బీజేపీ మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన పేరుతో గెలిచిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఫిర్యాదులు అందాయి. అయితే.. ఈ విషయమై సుప్రీం కోర్టు కూడా స్పీకర్ పై మండి పడ్డారు. ఫైనల్ గా కోర్టు ఏక్ నాథ్ షిండేకు శివసేన గుర్తు ఇచ్చింది.
ఇగో.. రాజకీయాలు కుళ్లి పోవడానికి బీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్నీ పార్టీలు కారకులే.. ఇంతకు ఈ కుళ్లిన రాజకీయాలకు శస్త్ర చికిత్స చేసేదెవరో..?

Leave A Reply

Your email address will not be published.

Breaking