Take a fresh look at your lifestyle.

కేసీఆర్ అహంకరంతో రెండు ఎమ్మెల్సీలు నష్టం

0 16

అహంకరం ఎంత పని చేసింది..
– రెండు ఎమ్మెల్సీలు చేజార్చుకున్న బీఆర్ ఎస్
– గవర్నర్ తో సీఎం రేవంత్ స్నేహ పూర్వక సంబంధాలు
– దస్త్రాలకు గవర్నర్ చకాచక ఆమోదం

బీఆర్ ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకరం వల్ల ఆ పార్టీ రెండు ఎమ్మెల్సీలను కోల్పోయింది. బీఆర్ ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను సిఫారసు చేయగా తమిళిసై తిరస్కరించారు.

సాహిత్యం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సమాజసేవవంటి రంగాలలో నిష్ణాతులైన వారిని సిఫారసు చేయాల్సి ఉండగా, బీఆర్ ఎస్ ప్రభుత్వం రాజకీయ నాయకుల పేర్లు పంపడంతో గవర్నర్ తిరస్కరించారు.

అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్నందున వెంటనే వీరి స్థానంలో ఇతరుల పేర్లు సిఫారసు చేయకుండా వీరిని కోర్టుకు పంపారు. ఈలోగా అధికారం చేజారి పోయింది. కోర్టు సైతం తాము మధ్యంతర ఉత్తర్వూలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

రేవంత్ ప్రభుత్వం సిఫారసు చేసిన కోదండరాం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. దీనిపై బీఆర్ ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అహంకరానికి, స్నేహపూర్వక సంబంధాలకు ఫలితం ఎలా ఉంటుందో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకమే నిదర్శనం.

గవర్నర్, మాజీ సీఎం కేసీఆర్ మధ్య సంబంధాలు లేవు. అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వనించలేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో అక్కడ ప్రోటోకల్ ప్రకారం స్వాగతం పలుకల్సి ఉండగా, కింది స్థాయి అధికరులే వచ్చేవారు. గవర్నర్ కు అనేక అవమానాలు జరుగడంతో తన అధికరాలను విరియోగించారు. మంత్రి వర్గం పంపిన బిల్లులను పెండింగ్ లో పెట్టారు.

గవర్నర్ ను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరశైలి అలా ఉంటే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వ్యూవహాత్మకంగా వెళ్తున్నారు. ఇటీవల గవర్నర్ ను కలిసి గణతంత్ర దినోత్సవాలకు ఆహ్వనించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను, టీఎస్ పీఎస్ సీ చైర్మన్ నియామకనికి ఆమోదం తెలపాలని కోరారు. మరుసటి రోజే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

ప్రధానికి స్వాగతం పలకని కేసీఆర్

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్బంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలుకడం ఆనవాయితీ. ప్రధాని అధికార పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం గా కేసీఆర్ స్వాగతం పలికేవారు కాదు. స్వాగతంల పలుకక పోవడమే గాకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అవసరలను వివరించి నిధులు కోరలేదు.

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ప్రత్యర్థి అయినప్పటికీ రాష్ట్ర అవసరాల దృష్ట్య రేవంత్ పీఎంను కలిశారు. కేసీఆర్ అహంకారం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావల్సిన నిధులు కూడా రాలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking