Take a fresh look at your lifestyle.

మహిళల హృదయాలలో నిలిచిన వరలక్ష్మీ సేవలు

0 24

మహిళల అభ్యున్నతి కోసం

హెవెన్ హోమ్ సొసైటీ చేయూత

ఆమె ఆలోచనలు సఫరెట్.. అందరికి భిన్నంగా ఆలోచన చేస్తోంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలంటే పదవులు అవసరం లేదని భావించింది. అందుకే తాను స్వచ్ఛందంగా సేవా చేయాలని నిర్ణయించింది. అణచబడుతున్న మహిళలకు ఏదో చేయాలని ఆలోచన చేసింది. విద్యలో కావచ్చు.. ఆర్థికంగా కావచ్చు వెనుక బడిన మహిళలకు అండగా నిలువాలని భావించింది. తనతోటి స్నేహితులతో చర్చించింది. మీ ఆలోచన బాగుంది ముందుకు వెళ్లు అన్నారు ఫ్రెండ్స్.

వరలక్ష్మీ..

అంతే.. 2012లో హెవెన్ హోమ్స్ సొసైటీని ఏర్పాటు చేసింది వరలక్ష్మి. హైదరాబాద్ లోని యూసూప్ గూడ – చెక్ పోస్ట్ వద్ద ‘హెవెన్ హోమ్స్ సొసైటీ’ ఏర్పాటు చేసింది ఆమె. మహిళల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య ప్రయోజనాల కోసం పని చేస్తోంది.

లాభాపేక్ష లేకుండా మహిళలు, బాలికలకు చేయూత అందిస్తోంది హెవెన్ హోమ్స్ సొసైటీ. మహిళలు మరియు బాలికలను రక్షించడం,  సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతుంది ఆ సోసైటీ.

మహిళల అభ్యున్నతి కోసం..

మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను చూసింది ‘హెవెన్ హోమ్స్ సొసైటీ’ వ్యవస్థాపకురాలు వరలక్ష్మీ. అనాధలైన మహిళలకు ఆరోగ్యంపై అవగహన లేక ఆవస్థలు పడుతున్నారని ప్రత్యక్షంగా చూసింది. వైద్యులతో చర్చించింది.

 

ఒకటి… రెండు కాదు.. పదకొండు ఏళ్లలో వందకు పైగానే ఉచిత ఆరోగ్య శిభిరాలు నిర్వహించింది. వేలాది మంది మహిళలకు ఆరోగ్యంపై అవగహన కల్పించింది. వారి ఆరోగ్యంకు తోడ్పాటుగా నిలిసింది ‘హెవెన్ హోమ్స్ సొసైటీ’..

విద్యార్థులకు అవగహన..

“వాయిస్ ఆఫ్ భారత్” పేరుతో ‘హెవెన్ హోమ్స్ సొసైటీ’ విద్యాలయాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగహన కల్పించడానికి శ్రీకారం చుట్టింది. కార్మికులు నివసించే వాడలోకి వెళ్లింది సోసైటీ.. యువతకు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంచడం లక్ష్యంగా ముందుకు వెళుతుంది ‘హెవెన్ హోమ్స్ సొసైటీ’. జీవితంలో ఎదురయ్యే సమస్యల పట్ల మహిళలు ఎలా అధిగమించాలో ప్రత్యేక క్యాంపుల ద్వారా వారిని చైతన్యవంతులను చేయడమే మా హెవెన్ హోమ్ సొసైటీ లక్ష్యం అంటుంది వ్యవస్థాపకురాలు వరలక్ష్మీ.

మహిళల మానసిక శ్రేయస్సు, మహిళల భద్రత, కెరీర్ కౌన్సెలింగ్, గురించి అవగాహన కల్పించడం మా ప్రాథమిక లక్ష్యం అని పేర్కొంటుంది. పెళ్లైన యువతులకు చట్టాలపై అవగహన కల్పించడంలో హెవెన్ హోమ్ సొసైటీ ప్రయత్నిస్తోంది. ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తుంది హెవెన్ హోమ్ సొసైటీ.  అందరూ సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి అవసరమైన నైపుణ్యాలను వారికి అందించడం మా ధ్యేయం అంటూ ముందుకు అడుగులు వేస్తోంది.

మెథడాలజీ – కెరీర్ కౌన్సెలింగ్:

ఒక వ్యక్తిని తీర్చిదిద్దడంలో కెరీర్ కౌన్సెలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ దిశగా మహిళలకు సహకారిస్తుంది హెవెన్ హోమ్ సొసైటీ.  విద్యార్థినులకు కెరీర్ గైడెన్స్ అందిస్తోంది. నిరాక్షరాస్యులకు చదువుతో పాటు జీవనోపాధి అవకాశాలను అందించి నైపుణ్యాభివృద్ధి శిక్షణా ఇస్తోంది హెవెన్ హోమ్ సొసైటీ.

ఆత్మరక్షణ మరియు భద్రతా చర్యలు

ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటే రక్షణ కరువే.. అలాంటి మహిళలకు ఆత్మరక్షణ పద్ధతులను నేర్పుతుంది. ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లను నిర్వహించి ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఎదుర్కొవాలో శిక్షణ ఇస్తోంది హెవెన్ హోమ్ సొసైటీ.

జాగ్రత్తలు మరియు సామాజిక భద్రత:

ద్వేషపూరిత నేరాలు ప్రబలంగా కొనసాగుతున్న నేపథ్యంలో యువతకు అవగాహన కల్పించి, జాగ్రత్తలు వివరిస్తోంది హెవెన్ హోమ్ సొసైటీ. సామాజిక భద్రతా చర్యలపై అవగహన కల్పిస్తోంది.

ఆత్మహత్యల నివారణ కోసం..

క్షణిక అవేశంలో జీవితానికి ముగింపు ఇస్తున్న మహిళలకు, యువతులకు సైకాలాజిస్ట్ ల ద్వారా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇప్పిస్తోంది హెవెన్ హోమ్ సొసైటీ. ఆత్మహత్య చేసుకోవాలని వచ్చే వారు ఏమి చేయాలో ప్రత్యేకంగా అవగహన కల్పిస్తోంది హెవెన్ హోమ్ సొసైటీ. సమస్యలకు భయపడి విలువైన జీవితాన్ని ఆత్మహత్యతో సరి పెట్టుకోవద్దని సలహాలు ఇస్తోంది హెవెన్ హోమ్ సొసైటీ.

హెవెన్ హోమ్ సొసైటీకి బెస్ట్ అవార్డుల పంట

హెవెన్ హోమ్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛంద సేవాలకు గాను గల్లి నుంచి ఢిల్లీ వరకు ప్రసంశాలు అందుకుంటుంది. దేశ ప్రధాని మోది, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులాంటి ప్రముఖులతో శబ్బాష్ అనిపించుకుంది హెవెన్ హోమ్ సొసైటీ వ్యవస్థాపకురాలు వరలక్ష్మీ.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఢిల్లీలాంటి నగరంలో కూడా మహిళల ప్రయోజనాల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించిన వరలక్ష్మీ సేవాలను అభినందిస్తున్నారు ప్రముఖులు.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking