గోవులను రక్షించిన పోలీసులు
నిర్దేశం, మేడ్చల్ :
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి యంనంపేట ఎక్స్ రోడ్ లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను ఘట్ కేసర్ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుండి హైదరాబాద్ బార్కాస్ కు ఒక వ్యాన్ లో 23 ఆవులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు భజరంగ్ దళ్ , గోరక్ష్ దళ్ నాయకులు ఘట్ కేసర్ వద్ద సదరు వ్యాన్ ను ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘట్ కేసర్ పోలీసులు ఆవులను స్వాధీనం చేసుకుని జియాగూడ గోశాల తరలించారు.