Take a fresh look at your lifestyle.

దళితుడే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు?

తెలంగాణ కాంగ్రెస్ అంటే రెడ్డి సామాజిక వర్గమే అన్నట్లు మారిపోయింది. పార్టీలో కీలక పదవులు రెడ్డిలకే ఉంటూ వస్తున్నాయి.

0 154

నిర్దేశం: దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా తెలంగాణలో కూడా దళిత నాయకుడినే అధ్యక్షుడిని చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు ఉన్నప్పటికీ దళితుడికి అవకాశం కల్పించాలని చూస్తున్నారట.

రెడ్డి ఆధిపత్యంపై నారాజ్
వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ అంటే రెడ్డి సామాజిక వర్గమే అన్నట్లు మారిపోయింది. పార్టీలో కీలక పదవులు రెడ్డిలకే ఉంటూ వస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక రెవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా, ఎక్కువ మంత్రి పదవులు రెడ్డిలకే దక్కాయి. దీంతో వెనుకబడిన సామాజిక వర్గాలకు కాంగ్రెస్ లో తగిన ప్రాధాన్యత ఉండదనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దళితుడికి అధ్యక్ష పదవి ఇస్తే ఈ ప్రచారానికి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ సామాజిక న్యాయం
వాస్తవానికి కొంత కాలంగా రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వారికి ఉద్యోగాల్లో, అవకాశాల్లో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని తన ప్రచారంలో రాహుల్ ప్రధానంగా చెప్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని కీలకమైన పదవుల్లో దళిత వంటి అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తోందట. ప్రస్తుతం రేసులో మిగతా వారితో పాటు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఉన్నారు. ఇవి నిజమైతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంపత్ నియామకం అవుతారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking