Take a fresh look at your lifestyle.

హైకోర్టులో ప్రణీత్ రావుకు చుక్కెదురు

0 17

హైకోర్టులో ప్రణీత్ రావుకు చుక్కెదురు
నిర్దేశం, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను కస్టడీకి అప్పగించే విషయంలో షరతులు విధించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ విషయాలను మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనూ సరైన సుదుపాయాలు లేవని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రణీత్ రావు తరఫున సీనియర్ లాయర్ గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు.పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. కింది కోర్టు ఆదేశాల ప్రకారమే కస్టడీలో ప్రణీత్ రావును పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. ఆయనను ప్రశ్నిస్తున్న పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలున్నాయని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసిన ఏసీపీ రమేష్ కు ప్రణీత్ రావు కేసు దర్యాప్తుతో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ప్రణీత్ రావు కుటుంబ సభ్యులతోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోరారు. ఇరుపపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకర్టు ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పటికే ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ నాలుగు రోజులు పూర్తైంది. మరో 3 రోజుల ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking