Take a fresh look at your lifestyle.

గురుతుల్యులు శ్రీ నాగరాజు గారు నిన్న రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచారు

0 64

లవకుశ.. చిత్రంలో చిన్న వయసులో లవ పాత్ర ధారిగా అద్భుత నటనా ప్రతిభ కనబరచి అనేక చిత్రాల్లో ఉత్తమ సహాయ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన పెద్దలు, గురుతుల్యులు శ్రీ నాగరాజు గారు నిన్న రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచారు. నా చర వాణి కి వారి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం వచ్చింది. వీరి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు, సాహిత్య, కళా రంగాలకు తీరని లోటు.

2018లో పుట్టపర్తిలో వెన్నెల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్ఫూర్తిదాత.. జాతీయ పురస్కారాల ప్రదాన సభకు వారు నా ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా 36 మంది ప్రముఖులకు వెన్నెల .. స్ఫూర్తిదాత జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. సహృదయలు, మేటి నటుడు నాగరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వెన్నెల సాహిత్య వేదిక తరఫున ప్రకటిస్తున్నాం. ? డాక్టర్ ఉద్దండం చంద్ర శేఖర్, చైర్మన్, వెన్నెల సాహిత్య అకాడమీ

Leave A Reply

Your email address will not be published.

Breaking